Home » Mancherial
కులాలు వేరుకావడంతో పెద్దలను కాదని వివాహం చేసుకున్న ఆ యువజంట పెళ్లి ప్రయాణం ఆర్నెల్లలోనే విషాదాంతమైంది. భర్త ఆత్మహత్య చేసుకోగా, 15 రోజుల్లోనే భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది.
10th Exam Delay: పదో తరగతి పరీక్షల తొలిరోజే మంచిర్యాలలో విద్యార్థులకు అనుకోని ఘటన ఎదురైంది. సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.
సమష్టి కృషితో నే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని అదనపు క లెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. వయోజన విద్యాశాఖ ఆద్వర్యంలో బుధవారం ముత్యంపల్లి రైతువే దికలో నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.
మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
కవ్వాల టైగర్ జోన్‌లోని జన్నారం డివిజన్లో ఆదివారం నిర్వహించిన బర్డ్‌వాచ్ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్ కెమెరాల ద్వారా వీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
గోదావరి తీరం నుంచి రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గుడిరేవు గోదావరి నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
రైతుభరోసా, రేషన్‌కార్డుల సర్వేను పకడ్బం దీగా చేపట్టాలని ఆర్డీవో హరికృష్ణ సూచిం చారు. శనివారం కేతనపల్లి, వేమనపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలిం చారు. ఆర్డీవో మాట్లాడుతూ తప్పులు లేకుం డా వివరాలను నమోదు చేయాలని పేర్కొ న్నారు.