10th Class Exams: ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2023-03-18T20:10:09+05:30 IST

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు (10th Class Exams) నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షల నిర్వహిస్తారు.

10th Class Exams: ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు

హైదరాబాద్: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు (10th Class Exams) నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షల నిర్వహిస్తారు. ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. టెన్త్‌ పరీక్షలకు 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం (Telangana) నిర్ణయించింది. ఈక్రమంలోనే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల (CCTV surveillance) ఏర్పాటుకు ఆదేశించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులకు సర్క్యులర్‌ జారీ చేశారు. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌, నీటి సరఫరాతో పాటు ఇతర ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో లైవ్‌, స్టోరేజీ ఏర్పాట్లుండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రం ప్రైవేట్‌ స్కూళ్లో ఉన్నా సరే.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కెమెరాల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని ఆయా పాఠశాల యాజమాన్యాలే భరించాలని తెలిపింది.

Updated Date - 2023-03-18T20:10:09+05:30 IST