దేవుడి మాన్యంపై అధికార పార్టీ నేత కన్ను

ABN , First Publish Date - 2023-06-02T02:13:13+05:30 IST

మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో ఉన్న దేవుడి మాన్యంపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. ఆక్రమించు కోవడానికి భూమిని చదును చేయిస్తుండగా గ్రామస్థులు ఇటీవల అడ్డుకున్నారు.

దేవుడి మాన్యంపై అధికార పార్టీ నేత కన్ను
డోజర్‌తో భూమిని చదును చేయిస్తున్నఅధికార పార్టీ నేత

దేవుడి మాన్యంపై అధికార పార్టీ నేత కన్ను

అనంతగిరి, జూన 1: మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో ఉన్న దేవుడి మాన్యంపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. ఆక్రమించు కోవడానికి భూమిని చదును చేయిస్తుండగా గ్రామస్థులు ఇటీవల అడ్డుకున్నారు.కోదాడ పట్టణ శివారులోని సర్వే నెం.1024, 1025లో అనంతగిరి రా మాలయానికి చెందిన 24ఎకరాల దేవాలయ మాన్యం ఉంది. ఈ భూమిలో ని ఐదు ఎకరాలను ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీకి కేటాయించింది. పలువు రు ఇళ్లను నిర్మించుకున్నారు. ఈ భూములకు ఆనుకుని సాగర్‌ కాల్వ ఉంది. ఈ కాల్వ కొందరు పూడ్చి ఆక్రమించుకుని ఇటీవల కాలంలో కొంద రు ఇళ్లను నిర్మించుకున్నారు. కొమరబండకు చెందిన ఓ అధికార పార్టీ నే త, మార్కెట్‌ కమిటీ మాజీ వైఎస్‌ చైర్మన గత నెల 30వ తేదీన కాల్వను పూడ్చి భూమిని ఆక్రమించుకోవడానికి డోజర్‌తో చదును చేయిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. రూ.40లక్షల విలువైన 800గజాల భూమిని చదును చేయిస్తున్నారని గ్రామస్థులు అదే రోజు దేవాలయ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కోదాడ, అనంతగిరి మండలాల దేవాలయాల ఈవో చలపల్లి,అసిస్టెంట్‌ ఈవో షమ్మిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకు ని డోజర్‌ను అక్కడి నుంచి పంపేశారు. తదనంతరం రెవెన్యూ ఆర్‌ఐ గిరిప్రసాద్‌ సబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

దేవాలయ భూమిని చదును చేస్తున్నవారు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సంబంధిత పత్రాలను తీసుకురమ్మని ఆనాడే చె ప్పాం. నేటివరకు తీసుకురాలేదు. ఆక్రమణకు యత్నించినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ఆక్రమణ బారిన పడకుండా దేవుడి మాన్యాన్ని కాపాడుతాం.

- సంతో్‌షకిరణ్‌, తహసీల్దార్‌

Updated Date - 2023-06-02T02:13:13+05:30 IST