Dharavath Preethi Death: ప్రీతి శరీరంలో విషాలు ఉన్నాయా అని టాక్సికాలజీ పరీక్షకు శాంపిల్స్‌ పంపగా..

ABN , First Publish Date - 2023-03-06T03:34:45+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకతీయ మెడికల్‌ కళాశాల మెడికల్‌ విద్యార్థిని ధారావత్‌ ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె

Dharavath Preethi Death: ప్రీతి శరీరంలో విషాలు ఉన్నాయా అని టాక్సికాలజీ పరీక్షకు శాంపిల్స్‌ పంపగా..

పది రోజుల తర్వాత వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్‌

అనుమానాస్పద మృతి కేసుగా మార్చే అవకాశం

వరంగల్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకతీయ మెడికల్‌ కళాశాల మెడికల్‌ విద్యార్థిని ధారావత్‌ ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్‌ అనే మత్తు ఇంజెక్షన్‌ వయల్స్‌ పడి ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె శరీరంలో ఆ మందుల అవశేషాలతో పాటు, వేరేవైనా విషాలు ఉన్నాయా తెలుసుకునేందుకు హైదరాబాద్‌ డాక్టర్లు నమూనాలు సేకరించి టాక్సికాలజీ పరీక్షకు పంపారు. పదిరోజుల తర్వాత.. ఆ నివేదిక ఆదివారం వరంగల్‌ పోలీసులకు చేరింది.

ప్రీతి శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రసాయనాలూ కనిపించలేదని ఆ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంలో ఎలాంటి నిర్ధారణకూ రాలేని పరిస్థితి. ఆమె తల్లిదండ్రులేమో.. తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌ ఫోన్‌ కాల్‌డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, దానికంటే ముందు రెండు రోజులకు సంబంధించిన సైఫ్‌ కాల్‌ డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఆ వివరాల ఆధారంగా.. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం నుంచి రాత్రి వరకు వరంగల్‌ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బోనాల కిషన్‌ అతణ్ని విచారించారు. కాగా.. నాలుగు రోజుల సైఫ్‌ పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది. సోమవారం వరంగల్‌ జిలా ్లకోర్టులో హాజరుపర్చి, వైద్య పరీక్షలు నిర్వహించి, ఖమ్మం జైలుకు తరలించనున్నారు. విచారణలో సైఫ్‌ చెప్పిన విషయాలు, సేకరించిన ఆధారాలు తదితర అంశాలతో కూడిన రిపోర్టును ఏసీపీ సిద్ధం చేశారు. ఆదివారం ఆయన ప్రీతి స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తాండాకు వెళ్లి.. ఆమె కుటుంబసభ్యుల నుంచి కూడా ఏసీపీ కిషన్‌ వాంగ్మూలం నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి..

******************************

Medico Preethi : ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్.. సంచలన విషయాలు వెలుగులోకి.. కీలకంగా మారిన బ్యాగ్!

******************************

Medico Preethi : డాక్టర్ ప్రీతి ఘటనలో 11 అనుమానాలు.. అపస్మారక స్థితిలో ఉండగా ..!?

******************************

Medico Preethi : డీజీపీ నుంచి వరంగల్ సీపీకి ఫోన్.. కొత్త మలుపులు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి కేసు.. ఏం జరుగుతుందో ఏమో..!?

******************************

Updated Date - 2023-03-06T11:10:10+05:30 IST