Share News

Telangana Results: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వ్యూహం ఇదే.. తెలంగాణ ఓటర్లను ఆకట్టుకున్న కాంగ్రెస్ హామీలు..

ABN , First Publish Date - 2023-12-03T20:51:17+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్‌ను కేసీఆర్‌కే ఇచ్చారు. తొలి రెండు సార్లూ కేసీఆర్‌నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారు.

Telangana Results: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వ్యూహం ఇదే.. తెలంగాణ ఓటర్లను ఆకట్టుకున్న కాంగ్రెస్ హామీలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్‌ను కేసీఆర్‌కే (KCR) ఇచ్చారు. తొలి రెండు సార్లూ కేసీఆర్‌నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారు. మూడోసారి కూడా కేసీఆర్‌దే అధికారం అని అందరూ భావించారు. కొద్ది నెలల క్రితం జరిగిన మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు (Telangana Results).

అలాంటి స్థితి నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు కాంగ్రెస్ పుంజుకున్న తీరు అత్యద్భుతం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం సాధించడం వెనుక ఆ పార్టీ ఇచ్చిన పలు హామీలు కూడా కారణం అని చెప్పక తప్పదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక కూడా ఇలాంటి హామీలదే కీలక పాత్ర. అదే ఫార్ములాను కాంగ్రెస్ నేతలు ఇక్కడ కూడా అనుసరించారు. ప్రజల్లో అసంతృప్తి ఉన్న అంశాలను గమనించి వాటి ఆధారంగా హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకుంది. ప్రతినెల మహిళలకు రూ.2500, రూ.500 కే వంట గ్యాస్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైనవి మహిళలను ఆకట్టుకున్నాయి.

Telangana Results: బీఆర్ఎస్‌కు రాబోయే రోజుల్లో కొత్త సవాల్.. సెమీ అర్బన్ స్థానాల్లో బలపడిన కమలం..

అలాగే రైతు భరోసా పెంపు, భూమి లేని వారికి, కౌలు రైతులకు రూ.12 వేలు, అలాగే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ మొదలైనవి రైతులను ఆకట్టుకున్నాయి. ఇక, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.5 లక్షల ఉచిత విద్యా భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ మొదలైన హమీలు కాంగ్రెస్ విజయంలో కీలకంగా పని చేశాయి. ఈ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ నేతలు చురుగ్గా పని చేశారు.

Updated Date - 2023-12-03T20:51:19+05:30 IST