SIT: టీఎస్‌పీఎస్సీ కేసులో వెలుగులోకి కొత్త ముఠా దందా
ABN , First Publish Date - 2023-05-28T10:10:28+05:30 IST
టీఎస్‌పీఎస్సీ (TSPSC) కేసులో కొత్త ముఠా దందా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) కేసులో కొత్త ముఠా దందా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున విద్యుత్ ఏఈ పేపర్ చేతులు మారినట్లు గుర్తింపు సిట్ (SIT) అధికారులు గుర్తించారు. వరంగల్‌కు చెందిన విద్యుత్ శాఖ డీఈపై అనుమానాలు అన్నాయని, ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిశోర్‌ను అరెస్ట్ చేశారు. 20 మందికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో డీఈ పనిచేస్తున్నారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులతో డీఈ పరిచయాలు పెంచుకున్నారు. టాప్ మార్కులు సాధించిన అభ్యర్థులపై సిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 43 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఉప్పల్‌కు చెందిన భరత్‌నాయక్, వరంగల్‌కు చెందిన పాసికంటి రోహిత్‌కుమార్, గాదె సాయి మధు ఉన్నారు. ఈ ముగ్గురికీ నకిరేకల్‌కు చెందిన పూల రవికిశోర్ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ నిగ్గుతేల్చింది. అందుకు రూ. 3 లక్షల మేర ఒప్పందం కుదుర్చుకున్న భరత్, రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించినట్లు ఆధారాలను సేకరించింది.