Minister Errabelli: వైద్య విద్యార్థి సైఫ్‌పై చర్యలు..

ABN , First Publish Date - 2023-02-24T16:41:47+05:30 IST

వరంగల్: కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి (Preethi).. సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) వేధింపుల వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakara Rao)అన్నారు.

Minister Errabelli: వైద్య విద్యార్థి సైఫ్‌పై చర్యలు..

వరంగల్: కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి (Preethi).. సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) వేధింపుల వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakara Rao) స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యార్థి సైఫ్‌పై చర్యలు తీసుకున్నామని, జైల్‌కు కూడా పంపించామన్నారు. గతంలో ప్రీతి తల్లిదడ్రులు కంప్లైంట్ (Compliant) చేసినా పట్టించుకోలేదనేది కొంతవరకు వాస్తవమేనన్నారు. కానీ నిందితుడికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రీతి ఆరోగ్యంపైనే దృష్టి సారించిందని, ఈ విషయంలో సర్కార్ చాలా సీరియస్‌గా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. సైఫ్ మెసేజ్‌లు అన్నీ దొరికాయన్నారు. అతనికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు (BJP Leaders) చేస్తున్న కామెంట్స్ ఏవీ సరైనవిగా ఉండవన్నారు. ప్రీతి చాలా బ్రిలియంట్ గర్ల్ అన్నారు. వాళ్ళ కుటుంబానికి అందరూ అండగా ఉండాలి... లేనిపోనివి సృష్టించవద్దని కోరారు. ఆమె కండిషన్ సీరియస్‌గానే ఉందని, త్వరగా కోలుకోవాలని అందరం ఆశిద్దామని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతిని సైఫ్ వేధించడం నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) వెల్లడించారు. ప్రీతి చాలా సెన్సిటివ్ అని అన్నారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని, ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడని శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని నిర్ధారించినట్లు చెప్పారు. మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వచ్చిందని సీపీ వివరించారు.

వాట్సాప్ గ్రూపు (WhatsApp Group) లో ప్రీతిని టార్గెట్ చేస్తూ సైఫ్ వేధించాడని, ఇద్దరి మధ్య రెండు, మూడు ఘటనలు జరిగాయని సీపీ రంగనాథ్ (CP Ranganath) తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి గురించి అవమానకర పోస్టులు పెట్టాడన్నారు. గ్రూపులో పోస్టు పెట్టి తనను అవమానపరచవద్దని సైఫ్‌ని ప్రీతి వేడుకుందన్నారు. తనను అవమానపరిచావని సైఫ్‌తో ప్రీతి చెప్పిందని, ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకురావాలని ప్రీతి కోరిందని సీపీ వెల్లడించారు.

మరోవైపు ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. హైదరాబాద్‌ నిమ్స్‌ (Nims Hospital)లో ఆమెకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాగా డాక్టర్‌ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్‌ సపోర్ట్‌తో తరలించినట్లు నిమ్స్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

Updated Date - 2023-02-24T18:46:15+05:30 IST