రైలులో 27 మంది బాలకార్మికుల తరలింపు
ABN , First Publish Date - 2023-02-03T00:29:33+05:30 IST
బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి 14 యేళ్ల బాలలను హైదరాబాద్‌లో పనిచేయించేందుకు తరలిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.సంజీవరావు బృందం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 27మంది బాలలను పట్టుకుని చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బాలకార్మికులను స్టేషన్‌కు తరలించిన ఆర్పీఎఫ్
కాజీపేట, ఫిబ్రవరి 2: బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి 14 యేళ్ల బాలలను హైదరాబాద్‌లో పనిచేయించేందుకు తరలిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.సంజీవరావు బృందం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 27మంది బాలలను పట్టుకుని చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌వైపు వెళ్తున్న థానాపూర్ ఎక్స్‌ప్రె్‌సలో బుధవారం రాత్రి బాలకార్మికులను తరలిస్తున్నారన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, బేబీ బచావో ఆందోళన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రతీ బోగీలో తనిఖీలు చేస్తూ ప్రయాణికుల వివరాలు సేకరించారు. అనుమానంగా ఉన్న ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా వివిధ బోగీలలో 27 మంది బాలకార్మికులను హైదరాబాద్‌లో కూలి పనిచేయించేందుకు తరలిస్తున్నామని ఒప్పుకున్నారు. బోగీలలో ఉన్న పిల్లలను చూపించారు. దీంతో సికింద్రాబాద్‌లో ఏడుగురు ముఠాసభ్యులను రైలు దింపి పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, బాలకార్మికులను చైల్డ్‌లైన్‌కు అప్పగించినట్లు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం.సంజీవరావు తెలిపారు. బాలలను అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో బేబీ బచావో ఆందోళన్ స్టేట్ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ నరేశ్ ఉన్నారు.