MLA Muthireddy: ప్రజలు ఛీకొట్టిన నాయకులే నా బిడ్డను రోడ్డుపైకి తెచ్చారు

ABN , First Publish Date - 2023-07-01T14:54:57+05:30 IST

ప్రజలు ఛీకొట్టిన నాయకులు తన బిడ్డను రోడ్డుపైకి తెచ్చారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధ్వజమెత్తారు. మరోసారి ఆయన మీడియా ఎదుట కంటతడి పెట్టారు.

MLA Muthireddy: ప్రజలు ఛీకొట్టిన నాయకులే నా బిడ్డను రోడ్డుపైకి తెచ్చారు

జనగామ: ప్రజలు ఛీకొట్టిన నాయకులు తన బిడ్డను రోడ్డుపైకి తెచ్చారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (MLA Muthireddy Yadagiri Reddy) ధ్వజమెత్తారు. మరోసారి ఆయన మీడియా ఎదుట కంటతడి పెట్టారు. ‘‘ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేనోళ్లే తన బిడ్డను రోడ్డుపైకి తెచ్చారు. ఆడపిల్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజా సేవకు ఆటంకం కల్గించడంపై కోర్టుకు వెళ్లాను. నాకు భంగం కల్గించవద్దని కోర్టు చెప్పింది. కష్టపడి పనిచేసుకునే నా బిడ్డను నాపైకి ఉసిగొలిపి నీచ రాజకీయాలు చేస్తున్నారు. నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది.’’ అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-01T14:54:57+05:30 IST