బైబై.. గణేశా..

ABN , First Publish Date - 2023-09-27T00:17:34+05:30 IST

వినా యకుడిని సాగనంపడానికి సమయం ఆసన్నమైంది.. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న విఘ్నేశ్వరులను గంగమ్మ చెంతకు పంపించడానికి వేళ అయింది..

బైబై.. గణేశా..
మానుకోటలోని నిజాం చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

నేడే విఘ్నేశ్వరుడి నిమజ్జనం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

మానుకోట నిజాం చెరువు వద్ద సర్వం సిద్ధం

సౌకర్యాలపై అధికారులకు కలెక్టర్‌, ఎస్పీ సూచనలు

జిల్లా వ్యాప్తంగా 1,618 వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన

తొమ్మిది రోజులు పూజలందుకున్న విఘ్నేశ్వరుడు

ఉదయం 10 గంటల నుంచే తరలింపు ప్రారంభం

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 26 : వినా యకుడిని సాగనంపడానికి సమయం ఆసన్నమైంది.. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న విఘ్నేశ్వరులను గంగమ్మ చెంతకు పంపించడానికి వేళ అయింది.. భక్తుల నుంచి పూజలు స్వీకరించిన ఏకదంతుడిని బుధవారం నిమజ్ఞనం చేయనున్నారు.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మానుకోట పట్టణం తో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యక్ర మాలను నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 18వ తేదీన వినాయక చవితి పర్వదినం రోజున మండపాల్లో గణేశ్‌ విగ్రహాలు ఏర్పాటు చేసి, నవరాత్రుల పూజలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్‌ సెంటర్‌లో ఆహ్వాన వేదికను ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పసుపు, కుంకుమల తో వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి, నారికేళం సమర్పించి అక్కడి నుంచి నిజాం చెరువులో నిమజ్జనం చేసేందుకు పంపిస్తారు. ఇందులో భాగంగానే ఫారెస్టు సెంటర్‌లో వేదికను తయారు చేశారు. విఘ్నేశ్వరుల నిమజ్జనానికి అనువైన ప్రాంతంగా పట్టణంలోని నిజాం చెరువును గుర్తించి, అక్కడ ఏర్పాట్లను పూర్తి చేశారు. రాత్రివేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా నిజాం చెరువు సమీపంలో కొంతదూరం వరకు విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు.

కలెక్టర్‌ శశాంక, ఎస్పీ చంద్రమోహన్‌, అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌ రెడ్డి నిజాం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించా రు. నిమజ్ఞనానికి సంబంధించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ గణేశ్‌ నిమజ్జనం సజావుగా ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నా రు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. కార్యక్రమంలో ఆర్డీవో అలివేలు, మునిసిపల్‌ కమిష నర్‌ ప్రసన్నారాణి, ఆర్‌అండ్‌బీ ఈఈ తానేశ్వర్‌, డీఎస్పీ సత్యనారాయణ, విద్యుత్‌శాఖ డీఈ విజయ్‌, నీటిపారుదల శాఖ అధికారి సమ్మిరెడ్డి, సీఐ సతీష్‌, తహసీల్దార్‌ ఇమ్మా నియేల్‌, డీఈ ఉపేందర్‌, కౌన్సిలర్‌ మార్నేని వెంకన్న పా ల్గొన్నారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు రెండుక్రేన్లతో పాటు, ఒక పడవను సిద్ధం చేశారు.

విగ్రహాల తరలింపు రూట్‌మ్యాప్‌ ఇదే..

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న విగ్రహాల తరలింపుకు మునిసిపల్‌ అధికారులు రూట్‌ మ్యాప్‌ను తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,618 విగ్రహలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్క మానుకోట పట్టణంలో సుమారు 200 విగ్రహాలను నెలకొల్పగా, వాటిని తర లించేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశారు. కొత్త బజారులోని విగ్రహాలు నెహ్రూసెంటర్‌ నుంచి శ్రీనివాస సెంటర్‌, రామాలయం, ఆర్యూబీ, ఆర్వోబీ, వ్యవ సాయ మార్కెట్‌, నర్సంపేట బైపాస్‌ నుంచి బస్డాండ్‌ సెంటర్‌ మీదుగా నిజాం చెరువుకు తర లించనున్నారు. పాత బజారులోని విగ్రహాలు కూడ ఫారెస్టు సెంటర్‌లోని వేదిక వద్దకు వచ్చి పూజా అనంతరం నిమజ్జనానికి తరలించనున్నారు.

ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు..

జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ చంద్రమోహన్‌ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తును నిర్వహించనున్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, దాదాపు వంద మంది పోలీస్‌ సిబ్బంది విధు లు నిర్వహించనున్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటుతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటు లో ఉంచినట్లు ఎస్పీ వెల్లడించారు. గణేశ్‌ శోభయాత్ర సందర్భంగా ప్రధాన రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రశాంత మైన వాతావరణంలో గణేశ్‌ నిమజ్జన వేడుకలు జరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా ఉదయం నుంచే విగ్రహాలను మున్నేరు వాగుకు తరలించాలని సూచించారు. నిమజ్జనాల ఊరేగింపు వేడుకల్లో డీజే సౌండ్‌సిస్టమ్‌ ఉప యోగిం చవద్దని సూచించారు. జిల్లాలోని పట్టణాలు, మండ లాలు, గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన వేడుకలు ముగిసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బందికి సూచనలు చేశామని ఎస్పీ వివరించారు.

‘ఆదిదేవ’ లడ్డు ధర రూ.2,21,116

వేలంలో దక్కించుకున్న కేసముద్రం స్టేషన్‌ సర్పంచ్‌ భట్టు శ్రీను

కేసముద్రం, సెప్టెంబర్‌ 26 : కేసముద్రం రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఆదిదేవవెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద మంగళవారం రాత్రి లడ్డు వేలం ఉమ్మడి జి ల్లాలోనే రికార్డుస్థాయిలో పలికింది. రూ.2,21,116 లకు కేసముద్రం స్టేషన్‌ సర్పంచ్‌ భట్టు శ్రీను– కవిత దంపతులు కైవసం చేసుకున్నారు. గత ఏడాది ఈ లడ్డు రూ.2,01,516లకు ఖమ్మంకు చెందిన బుద్ధ శ్రీకాంత్‌–క్రాంతి దంపతులు దక్కిం చుకోగా, ఈసారి అంతకు మించివేలం పాడ టం విశేషం. గత ఆరు సంవత్సరాలుగా ఈ లడ్డు రికార్డుస్థాయిలో వేలం పలుకుతుండడంతో.. తిల కించేందుకు భారీ సంఖ్యలో భక్తులు, జనం హాజ రయ్యారు. ఈ సందర్భంగా భట్టు శ్రీను, కవిత దంపతులను నిర్వాహకులు సన్మానించారు.

Updated Date - 2023-09-27T00:17:34+05:30 IST