నిరుపేదలకు అందుతున్న కేంద్ర పథకాలు

ABN , First Publish Date - 2023-06-27T00:23:59+05:30 IST

రాష్ట్రంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఖిలావరంగల్‌ మండలం 43వ డివిజన్‌ నక్కలపల్లి, జక్కలొద్ది, గణేష్‌నగర్‌ విలీన గ్రామాల్లో సోమవారం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

నిరుపేదలకు అందుతున్న కేంద్ర పథకాలు
నక్కలపల్లిలో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేస్తున్న కొండేటి శ్రీధర్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌

వరంగల్‌, జూన్‌ 26: రాష్ట్రంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఖిలావరంగల్‌ మండలం 43వ డివిజన్‌ నక్కలపల్లి, జక్కలొద్ది, గణేష్‌నగర్‌ విలీన గ్రామాల్లో సోమవారం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు మల్లాడి రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నయా సైసా ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని వివరించారు. అవినీతిలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో సోషల్‌ మీడియా కన్వీనర్‌ తాళ్లపల్లి చంద్రశేఖర్‌, అజయ్‌, అభిలాష్‌, ఉసిల్ల దయాకర్‌, కిరణ్‌, మోరె ప్రభాస్‌, శ్రీనివాస్‌, కృష్ణ, రంజిత్‌, యేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-27T00:23:59+05:30 IST