‘చేతి’కి సింగరేణి చిక్కేనా..?!
ABN , Publish Date - Dec 25 , 2023 | 11:42 PM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు ముగింపు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు సింగరేణి ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగ రేణి ఏరియాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఆసిఫాబా ద్ మినహా మిగతా 11 చోట్లా కాంగ్రెస్, దాని మిత్రప క్షం సీపీఐలు విజయం సాధించాయి.
కోల్‌బెల్ట్‌లో పట్టుకు కాంగ్రెస్ కసరత్తు
సింగరేణి ఎన్నికల్లో సత్తాచాటేందుకు యత్నం
2003లో మాత్రమే గుర్తింపు సంఘంగా హోదా
2017 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో చేజారిన కేడర్
రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మళ్లీ ముమ్మర ప్రయత్నం
‘గులాబీ’ సంఘంలో అసమ్మతి కలిసి వస్తుందనే ఆశలు
బలంగా ఉన్న ఏఐటీయూసీని ఎదుర్కొనేందుకు వలసలకు ప్రోత్సాహం
భూపాలపల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు ముగింపు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు సింగరేణి ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగ రేణి ఏరియాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఆసిఫాబా ద్ మినహా మిగతా 11 చోట్లా కాంగ్రెస్, దాని మిత్రప క్షం సీపీఐలు విజయం సాధించాయి. సింగరేణి కార్మికు లు పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూల తీర్పు ఇచ్చారు. దీం తో సింగరేణిని సైతం చేజిక్కించుకోవాలనే తాపత్రా యంతో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. అయితే.. సింగరేణి ఏరియాలో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ)కు పెద్దగా బలం లేదు. 1998 నుంచి 2017 వరకు ఆరు పర్యాయాలు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే 2003-2007 మధ్యకాలంలో మాత్రమే ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కేవలం నాలుగేళ్లే అధికారంలో ఉండగా మిగతా 21ఏళ్లు ప్రతిపక్ష పాత్రలో ఉంటూ కేడర్‌ను కాపాడుకోలేక అపసోపాలు పడుతోంది. 20017 అక్టోబరు 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ పోటీకి దూరంగా ఉంది. సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ కి మద్దతు ఇచ్చింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీలో లేకపోవటంతో ఐఎన్‌టీయూసీ కేడర్ చాలా వరకు ఇతర సంఘాలకు వలస వెళ్లింది. ఫలితంగా ఐఎన్‌టీయూసీ సింగరేణిలో బలహీన పడిందనే టాక్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతోపాటు కోల్‌బెల్ట్ ఏరియాలో ఉన్న అసెంబ్లీ స్థానా ల్లో గెలుపొందడంతో కార్మికుల్లో పట్టు సాధించామనే ధీమా హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.
‘గులాబీ’ గలాట కలిసొచ్చేనా..?
సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించటంతో టీజీబీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకట్రావు, రాజిరెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీంతో దిగొచ్చిన బీఆర్‌ఎస్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఎమ్మెల్సీ కవితతో ప్రకటన చేయించింది. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయిందనే ప్రచారం ఉంది. గులాబీ సంఘంలో ఏర్పడిన ఈ సంక్షోభాన్ని తమకు అను కూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీబీజీకేఎస్‌కు రాజీనామా చేసిన కీలక నేతలు ఐఎన్‌టీయూసీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం లేదు. ముందుగా ఫిట్, ఏరి యా కమిటీల స్థాయిల నుంచి టీబీజీకేఎస్ నేతలను ఐఎన్‌టీయూసీలో చేర్చుకునేందుకు ప్రాముఖ్యాన్నిస్తు న్నారు. కిందిస్థాయి నేతల చేరికలపై దృష్టి పెడుతూనే కీలక నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తు తం సింగరేణిలో ఏఐటీయూసీ బలంగా ఉండటంతో దాన్ని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో సంఘాన్ని బలో పేతం చేసేందుకు కార్మిక సంఘం నాయకులు దృష్టి పెట్టారు. సింగరేణిలో 2012 నుంచి నేటి వరకు రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా టీజీబీకేఎస్ వ్యహ రించింది. ఉద్యమ సంఘంగా సింగరేణిలో బలంగా నాటుకుపోయింది. అయితే.. ఎన్నికల్లో పోటీకి అధిష్ఠా నం వెనుకడుగు వేసిందనే ప్రచారం ఆ సంఘం కేడర్ డీలా పడేలా చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రకటించినప్పటికీ కీలక నేతలెవరూ ఎన్నికల ప్రచారంలో కనిపించకపోవ డం కేడర్ నిరుత్సాహానికి కారణమైంది. దీంతో టీజీబీకే ఎస్‌లో నెలకొన్న ఈ అయోమయాన్ని ఐఎన్‌టీయూసీ తనకు అనుకూలంగా మలుచుకొని బలం పెంచుకు నేందుకు ప్రయత్నిస్తోందనే చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికలే కాంగ్రెస్ టార్గెట్
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌కు సింగరేణి ఎన్నికలు సవాల్‌గా మారా యి. 2024 మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగను న్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయమనేది పాలు పొంగు కాదని నిరూపిం చుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలవాలని ఆ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. దీంతో సింగరేణి ఎన్నికల్లో గెలుపుతో విజయపరం పరను పార్లమెంట్ వరకు కొనసాగించాలని హస్తం నేతలు స్కెచ్ వేస్తున్నారు. ఐదు పార్లమెంట్ స్థానాల పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లు ఉన్నాయి. వరంగల్ ఎంపీ పరిధిలో భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి పార్ల మెంట్ పరిధిలో రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో ఆసిఫాబాద్ నియోజకవర్గం, మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో పినపాక, ఇల్లందు, ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలో కొత్తగూడెం, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్, కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ గెలవగా మిగతా 10చోట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఐదు ఎంపీ స్థానాల్లో సింగరేణి ఓట్లే కీలకం కావటంతో సింగరేణి ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్ మినహా మిగతా నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీకి అంతగా పట్టులేదు. కేవలం బీఆర్‌ఎస్‌తోనే ముఖాముఖి పోటీ జరిగే అవకాశం ఉండటంతో హస్తం నేతలు సింగరేణి ఎన్నికల్లో గులాబీ సంఘం గెలవకుండా వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరిలో చేపట్టిన హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా సింగరేణి ఏరియాల్లో కూడా రేవంత్‌రెడ్డి పర్యటించారు. అలాగే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్ర సైతం సింగరేణి ఏరియాల్లో ఎక్కువ శాతం కవర్ చేశారు. దీంతో సింగరేణిపై సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి అవగాహ న ఉంది. ఇటీవలే ఆయనతో ఐఎన్‌టీయూసీ నేతలు సమావేశంలో కూడా సింగరేణిలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా పట్టు సాధించాలని దిశనిర్దేశం చేశారు. కోల్‌బెల్ట్ ఏరియాకు చెందిన మంత్రి దుద్ధిళ్ల శ్రీఽధర్‌బాబు పర్యవేక్షణలో ఐఎన్‌టీయూసీ సింగరేణి ఎన్నికల్లో వ్యూహాలను అమలు చేస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌కు సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందరే టాక్ వినిపిస్తోంది.