Mahabubabad: వివాదాస్పదమవుతున్న కలెక్టర్ శశాంక్ తీరు..

ABN , First Publish Date - 2023-01-20T12:38:30+05:30 IST

మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ శశాంక్ (Shashank) తీరు వివాదాస్పదమవుతోంది. అధికారుల నియామకాల్లో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Mahabubabad: వివాదాస్పదమవుతున్న కలెక్టర్ శశాంక్ తీరు..

మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ శశాంక్ (Shashank) తీరు వివాదాస్పదమవుతోంది. అధికారుల నియామకాల్లో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మహబూబాబాద్ (Mahabubabad) డీపీవో (DPO)గా స్వరూపరాణిని నియమిస్తూ ఈ నెల 7న ప్ర

భుత్వం ఉత్తర్వులు (Government orders) జారీ చేసింది. వెంటనే ఈ నెల 9న ఆమె మహబూబాబాద్ కలెక్టరుకు రిపోర్టు చేశారు. అయితే ఆమెను మహబూబాబాద్ డీపీవోగా నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చినా.. జిల్లా కలెక్టర్ శశాంక్ పట్టించుకోకుండా మరిపెడ ఎంపీడీవో ధన్ సింగ్‌ను మహబూబాబాద్ ఇన్చార్జ్‌ డీపీవోగా ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం నియమించిన డీపీవో స్వరూపరాణిని విధుల్లో చేర్చుకోకుండా ఎంపీడీవోకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం ఎంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-01-20T12:38:34+05:30 IST