Home » Politics
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.
కాంగ్రెస్‌కు చెందిన రాధాకృష్ణ కిషోర్‌కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పటించారు. దీపికా పాండే, సుదివ్య సోను, ఇర్ఫాన్ అన్సారీలకు మూడేసి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. హఫీజుల్ హసన్, యోగేంద్ర ప్రసాద్, చమ్రా లిండా, రాందాస్ సోరెన్, దీపక్ బిరువా, సంజయ్ ప్రసాద్ యాదవ్‌లకు..
వచ్చింది బొటాబొటీ మెజారిటీ..! అలిగి అరడజను మంది ఎమ్మెల్యేలను చీల్చుకుపోగలిగే నేతలూ ఉన్నారనే చర్చ..! పార్టీ చరిత్ర చూస్తే.. నిత్యం అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలు..!
మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన స్వగ్రామానికి వెళ్లారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం కానుంది. అయితే సీఎం పదవి తనకు ఇవ్వలేదనే కారణంతోనే ఆయన తన గ్రామానికి వెళ్లారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఆసక్తిరేపిన మహారాష్ట్ర కొత్త సీఎం పేరు దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఇంకా ప్రకటన వెలువడనప్పటికీ, ఆయా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, దేవేంద్ర ఫడ్నవీస్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది.
ఏక్నాథ్ షిండే.. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కుటుంబ పోషణ కోసం ఆటో రిక్షా, టెంపో డ్రైవర్‌గా పనిచేసిన షిండే.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో అగ్ర నేతగా ఉన్నారు. గత సీఎం ఉద్దవ్ ఠాక్రేకు చుక్కలు చూపించిన ఏక్నాథ్ షిండే గురించి పూర్తిగా ఈ కథనంలో తెలుసుకుందాం..
ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం ఇలానే అభివృద్ధి చెందాయన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో..సావుకు పోతున్నావో.. తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్..28 రూపాయలు తీసుకురాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్‌కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్సత్ తెలిపారు.
ఆర్నెల్ల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో తమకు వచ్చిన వ్యతిరేక ఫలితాల నైరాశ్యం నుంచి తేరుకుని మహారాష్ట్రలో ‘మహాయుతి’ సాధించిన విజయం అద్భుతమే! అయితే ఆ అద్భుతం దానంతట అదే జరగలేదు.