సమస్యల వలయంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి
ABN , First Publish Date - 2023-02-13T00:34:02+05:30 IST
వైద్యులు, సరైన వసతులు లేక వరంగల్ లేబర్‌కాలనీలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి కొట్టుమిట్టాడుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అతిపెద్ద ఆస్పత్రి కార్మిక బీమా డిస్పెన్సరీ (ఈఎస్‌ఐ) ఇదే కావడం. 55 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీడీ, భవన నిర్మాణ, బట్టల షాపులు, హోటళ్లు, సినిమాహాల్స్, మాల్స్ పార్కులు, కర్ర కోత మిషన్లు, హమాలీ, గుమాస్తా తదితర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఉచితంగా వైద్యాన్ని అందించే ఆస్పత్రి కార్మిక బీమా డిస్పెన్సరీ(ఈఎస్‌ఐ).
పేరుకే లేబర్‌కాలనీలో పెద్దాస్పత్రి
అరకొర వసతులతో ఇక్కట్లు
ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం
అందుబాటులోకి రాని అత్యవసర పరికరాలు
ఆందోళన చెందుతున్న కార్మికులు
ఖిలావరంగల్, ఫిబ్రవరి 12: వైద్యులు, సరైన వసతులు లేక వరంగల్ లేబర్‌కాలనీలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి కొట్టుమిట్టాడుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అతిపెద్ద ఆస్పత్రి కార్మిక బీమా డిస్పెన్సరీ (ఈఎస్‌ఐ) ఇదే కావడం. 55 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీడీ, భవన నిర్మాణ, బట్టల షాపులు, హోటళ్లు, సినిమాహాల్స్, మాల్స్ పార్కులు, కర్ర కోత మిషన్లు, హమాలీ, గుమాస్తా తదితర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఉచితంగా వైద్యాన్ని అందించే ఆస్పత్రి కార్మిక బీమా డిస్పెన్సరీ(ఈఎస్‌ఐ). లేబర్‌కాలనీ(ప్రగతి ఇండ స్టీయల్‌కాలనీ)లో 2, ఏప్రిల్ 1968లో కార్మిక బీమా ఆస్పత్రిని సుమారు 11 ఎకరాల స్థలంలో 50పడకల ఆస్పత్రిని నిర్మించారు. ఆస్పత్రిలో వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి వివిధ రకాల ప్రైవేట్ రంగాల్లో పనిచేసే కార్మి కులు ప్రతీనెల పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించి కార్డు పొందిన కార్మికులతోపాటు వారి క ుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం అందించేలా ఆస్పత్రిని నిర్మించారు. దీర్ఘకాలిక రోగులకు బీపీ, షుగర్, తదితర రోగాలకు ప్రతీనెల మందులను అందజేస్తారు. ఈఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులతోపాటు వారి కుటుంబసభ్యులకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు.
పలుచోట్ల డిస్పెన్సరీలు..
వరంగల్‌ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వివిధ రకాల శస్త్ర చికిత్సలు సైతం అందిస్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రత్యేకంగా 4 డిస్పెన్సరీలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా రెడ్డికాలనీలో, వరంగల్ జిల్లాలోని ఇండస్టీయల్ కాలనీలో, వరంగల్ కరీమాబాద్‌లో గిర్మాజీపేట వివేకానందకాలనీలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. అలాగే నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో సైతం డిస్పెన్సరీ కొనసాగుతోంది. డిస్పెన్సరీలు ప్రాంతంలోని ప్రైవేట్ కార్మికులకు డాక్టర్లు పరీక్షలు జరిపి మందులను అంద జేస్తారు.
వైద్యుల లేక..
ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు, నరాలు, గర్బసంచి, పళ్ళు, గొంతు, చెవి, ముక్కు, తల, క్యాన్సర్ తదితర ప్రాణాంతకమైన వ్యాధులకు చికిత్స అందించేందుకు డాక్టర్లు లేక రోగాలు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రిటైర్‌మెంట్, ప్రమోషన్ అయిన డాక్టర్‌ల స్థానంలో కొత్త డాక్టర్‌లు రావడం లేదు. నూతనంగా రిక్రూట్ అయ్యే డాక్టర్లు హనుమకొండ, హైదరాబాద్‌లో రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాలలోని ఆస్పత్రులలో చేరడానికి మొగ్గుచూపుతున్నారు. వరంగల్ శివారు ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ నూతనంగా వచ్చే డాక్టర్లు చేరడం లేదని రోగులు, స్థానికులు వాపోతున్నారు. గైనకాలజీ, డెంటల్, పిల్ల్లల డాక్టర్, ఎముకల డాక్టర్‌లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు., 5-ఫిమేల్ నర్సులు, వాచ్‌మెన్‌లను నియమించడం లేదు.
అందుబాటులో లేని పరికరాలు..
ఎక్స్‌రే, స్కానింగ్ మిషన్ తదితర అత్యవసర పరికరాలు రోగులకు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. రోగులు ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఇంతదూరం వస్తే అటు డాక్టర్లు లేక, ఇటు పరికరాలు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఖమ్మం, కరీంనగర్‌ల నుంచి వందలాదిగా రోగులు వస్తుండేవారు. ప్రస్తుతం 40నుంచి 80 మంది రోగులు అవుట్ పెషంట్స్ మాత్రమే వస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఇన్‌పెషంట్లు మాత్రం స్త్రీ, పురుషులు మొత్తం 20 మంది మాత్రమే ఆస్నత్రిలో చికిత్స పొందుత ున్నారు. అత్యవసర సవ ుయాలలో రోగులను తీసుక ువచ్చే అంబులెన్స్ పాడైపొవడంతో దానిని ఓ మూలన పడేశారు.
రూ.5కోట్లతో ఆధునీకరణ..
ఈఎస్‌ఐ ఆస్పత్రిని సుమారు రూ.5 కోట్లతో ఆధునీకరించారు. రోడ్లు, ఆస్పత్రి చుట్టూ ప్రహరి, ఫెన్సింగ్, గదులు, ల్యాబ్‌లు ఆధునీకరించారు. కానీ డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు లేకపోవడం రోగులకు శాపంగా మారింది.