ఆదర్శ గ్రామాలు విస్తృతంగా పెరగాలి
ABN , First Publish Date - 2023-07-17T23:57:14+05:30 IST
దేశంలో ఆదర్శ గ్రామాలు విస్తృ తంగా పెరగాలని, అంటువ్యాధి సోకినపుడు ఎలా వ్యాప్తి చెందుతుందో అలా శరవేగంగా కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామాలైన గంగదేవిపల్లి, మరియపురం గ్రామాలను ఆయ న సోమవారం సందర్శించారు. గ్రామాల్లోని అభివృద్ధి, ప్రజ ల స్వచ్ఛంద, ప్రభుత్వ సహకారాన్ని అడిగి తెలుసుకు న్నారు. మరియపురం తక్కువ సమయంలో జాతీయ ఆద ర్శగ్రామంగా ఎదిగిన తీరు, సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషిని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామా భివృద్ధికి మహిళ అందిస్తున్న
గీసుగొండ, జూలై 17: దేశంలో ఆదర్శ గ్రామాలు విస్తృ తంగా పెరగాలని, అంటువ్యాధి సోకినపుడు ఎలా వ్యాప్తి చెందుతుందో అలా శరవేగంగా కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామాలైన గంగదేవిపల్లి, మరియపురం గ్రామాలను ఆయ న సోమవారం సందర్శించారు. గ్రామాల్లోని అభివృద్ధి, ప్రజ ల స్వచ్ఛంద, ప్రభుత్వ సహకారాన్ని అడిగి తెలుసుకు న్నారు. మరియపురం తక్కువ సమయంలో జాతీయ ఆద ర్శగ్రామంగా ఎదిగిన తీరు, సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషిని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామా భివృద్ధికి మహిళ అందిస్తున్న సహకారంతోనే అతితక్కువ సమయంలో గ్రామాన్ని జాతీయ ఆదర్శ గ్రామంగా తీర్చిది ద్దినట్లు బాలిరెడ్డి వివరించారు. గ్రామంలోని అన్ని ఇండ్లతో సోలార్ సిస్టంను ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఆదర్శ గ్రామాలపై తాను ముంబై యూనివర్సి టీలో పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా స్టడీ టూర్‌కు ఈ గ్రామాలకు వచ్చినట్లు చెప్పారు. కాగా గంగదేవిపల్లిలో లక్ష్మీనారాయణకు మహిళలు పూలమాలలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ పోలీస్ ధర్మారావు, జిల్లా ట్రేయినింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, సర్పంచ్‌లు అల్లం బాలిరెడ్డి, గోనె మల్లారెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, అంకతి నాగేశ్వర్‌రావు, వార్డు సభ్యులు, కార్యదర్శులు స్వప్న, తపస్విని పాల్గొన్నారు.