‘కంటి వెలుగు’కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-01-18T00:04:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోం ది. 2018లోనే మొదటి విడత పూర్తి కాగా, ఈ నెల 19 నుంచి కంటి వెలుగు రెండోవిడత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా అదనపు సిబ్బంది నియామకంతోపాటు అందుకు కావాల్సిన సామగ్రిని సైతం ఏ ర్పాటు చేస్తోంది.

‘కంటి వెలుగు’కు సర్వం సిద్ధం

రేపటి నుంచి రెండో విడత ప్రారంభం

జిల్లాలో 45 బృందాల ఏర్పాటు

పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం

సద్వినియోగం చేసుకోవాలి : డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.సాంబశివరావు

హనుమకొండ రూరల్‌, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోం ది. 2018లోనే మొదటి విడత పూర్తి కాగా, ఈ నెల 19 నుంచి కంటి వెలుగు రెండోవిడత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా అదనపు సిబ్బంది నియామకంతోపాటు అందుకు కావాల్సిన సామగ్రిని సైతం ఏ ర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా వైద్య ఆరోగ్యశాఖమంత్రి టి.హరీ్‌షరావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటి వెలుగుపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, వార్డులలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు కం టివెలుగు నిర్వహణలో భాగస్వాములు కావాలని సూచించారు.

శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కంటివెలుగు కార్యక్రమం 2018లో చేపట్టింది. అవసరమైన వారికి అద్దాలు, మందులను పంపిణీ చేసింది. ఇప్పుడు రెండో విడత కంటివెలుగును విజయవంతం చేసేందుకు వైద్యాధికారులు, సూపర్‌ వైజర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. పీహెచ్‌సీ స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు, కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీలు, రైతు వేదికలు, కమ్యూనిటీ భవనాలను కంటివెలుగు శిబిరాల కోసం వినియోగించుకోనున్నారు.

విస్తృత ప్రచారం

పట్టణాలు, పల్లెల్లో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మొదటి విడతకంటే కంటివెలుగు-2ను విజయవంతం చేసేందుకు జిల్లా యం త్రాంగం చర్యలు చేపట్టింది. కంటివెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అన్ని మండలాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మునిసిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పుంచుల తో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, మునిసిపల్‌ స్థాయిలో మునిసిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లతో సమావేశం ని ర్వహించి విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రతి రోజు ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సోమవా రం నుంచి శుక్రవారం వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. కంటి వెలుగు శిబిరం నిర్వహించే ప్రాంతాల్లో ఒక రోజు ముందుగా చాటింపు చేయించి కార్యక్రమాన్ని చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి.

45 బృందాల ఏర్పాటు

కంటివెలుగు-2 కింద 18 యేళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో 45 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృం దంలో ఒక ఆప్తాలమిక్‌ డాక్టర్‌, ఒక వైద్యాధికారి, ఇద్దరు ఆశా కార్యకర్తలు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్‌తో కలిసి మొత్తం 15 మంది సభ్యులు ఉం టారు. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాల్లో 208, పట్టణ ప్రాంతాల్లో 74 క్యాంపులను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రోజుకు 300 మందికి, పట్టణాల్లో 400 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. జనాభాను బట్టి శిబిరాలు ఏర్పాటు చేసి కంటీ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రానికి 57,780 కంటి అద్దాలు ఇప్పటికే చేరుకున్నాయి. కంటి సమస్యలు ఉన్న వారికి తక్షణమే రీడింగ్‌ గ్లాసులు అందజేస్తారు. కంప్యూటర్‌ ద్వారా పరీక్షించి దూరదృష్టి తదితర కంటి సమస్యలు ఉంటే బార్‌కోడ్‌ విధానం ద్వారా రోగికి ఆశా, ఆరోగ్య కార్యకర్తల ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్దనే వారం పదిరోజుల్లో కంటి అద్దాలను అందజేస్తారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న వారి వివరాలను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి

- డాక్టర్‌ బి.సాంబశివరావు, డీఎంహెచ్‌వో

జిల్లాలో కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఇప్పటికే వైద్యులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. శిబిరాలకు అవసరమైన పరికరాలు, ఇతరత్రా సామగ్రి జిల్లాకు చేరుకుంది. పట్టణాలు, పల్లెల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించాం. శిబిరాలకు వచ్చే ప్రజలు ఆధార్‌కార్డు తమ వెంట తెచ్చుకోవాలి. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2023-01-18T00:04:43+05:30 IST