బీజేపీలో చేరిక
ABN , First Publish Date - 2023-01-30T00:33:36+05:30 IST
మండలంలోని అంబట్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముల్కల రాజమల్లు యాదవ్, బీఆర్‌ఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు గుజ్లు శంకర్ బీజేపీలో చేరారు.
మహదేవపూర్ రూరల్, జనవరి 29 : మండలంలోని అంబట్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముల్కల రాజమల్లు యాదవ్, బీఆర్‌ఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు గుజ్లు శంకర్ బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో తీర్థం పుచ్చుకు న్నారు. బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల సునీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసంలో ఆదివారం జరిగింది. కేంద్రంలో బీజేపీ సిద్ధాంతాలు, కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై చేరామని రాజమల్లు, శంకర్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సూరం మహేష్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు లింగంపల్లి జోగేశ్వర్‌రావు, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్‌చార్జి నాగపురి శ్రీనివాస్ పాల్గొన్నారు.