Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన..ముందస్తుగా అరెస్టులు

ABN , First Publish Date - 2023-03-23T09:19:27+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో(Combined Warangal District) నేడు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ...

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన..ముందస్తుగా అరెస్టులు

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో(Combined Warangal District) నేడు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా, దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన(CM's visit) సందర్భంగా విపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. కాగా, తొర్రూరు,పెద్దవంగర, మండలాల్లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ ఎంఎల్ పార్టీ(BJP, Congress, CPI ML party), పలు ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‎లు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

Updated Date - 2023-03-23T09:25:05+05:30 IST