దైవభక్తితోనే మానసిక ప్రశాంతత : మంత్రి దయాకర్‌రావు
ABN , First Publish Date - 2023-02-24T23:30:59+05:30 IST
భక్తిని అలవర్చుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన తూర్పు రాజగోపుర శిఖర ప్రతిష్ఠలో జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా శ్రీదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి ఆధ్వర్యంలో యాగశాల వద్ద కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 50 అడుగుల ఎత్తులో ఉన్న 5 అంతస్థుల రాజగోపురంపైకి వేదపండితుల మంత్ర్ఛోరణలతో కలశాలను భక్తిశ్రద్ధలతో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి,
-కొమ్మాల ఘనంగా రాజగోపురం శిఖర ప్రతిష్ఠ
గీసుగొండ, ఫిబ్రవరి 24: దైవభక్తిని అలవర్చుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన తూర్పు రాజగోపుర శిఖర ప్రతిష్ఠలో జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా శ్రీదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి ఆధ్వర్యంలో యాగశాల వద్ద కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 50 అడుగుల ఎత్తులో ఉన్న 5 అంతస్థుల రాజగోపురంపైకి వేదపండితుల మంత్ర్ఛోరణలతో కలశాలను భక్తిశ్రద్ధలతో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీల బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, అర్చకులు రామాచార్యులు, విష్ణు, ఫణీంద్రలు రాజగోపురంపైకి తీసుకెళ్లారు. అనంతరం జీయర్‌స్వామి ఆధ్వర్యంలో రాజగోపుర శిఖరంపై కలశాల ప్రతిష్ఠ, కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. కఆలయ అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి మంత్రిని కోరగా, ప్రతిపాదనలను పంపిస్తే నిధుల మంజూరుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. మూడంతస్తుల సత్రాల భవన నిర్మాణానికి సంబంధంచిన ప్రతిపాదన మ్యాప్‌ను మంత్రికి ఈవో శేషగిరి, ఆలయ కమిటీ సభ్యులు చూపించి వివరించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఆడపిల్ల పుట్టుకను భారంగా భావించొద్దు
శ్రీదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి
రాజగోపుర శిఖర ప్రతిష్ఠ అనంతరం శ్రీదండి దేవనాఽథ రామానుజ జీయర్‌స్వామి ఆధ్వర్యంలో శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణం, మంగళసూత్రం విశిష్ఠతను జీయర్‌స్వామి వివరించారు. నేడు ఆడపిల్ల పుట్టుకను భారంగా భావిస్తున్నారని ఇది సమాజానికి అరిష్టమన్నారు. మానవ తరాల, వంశాల వృద్ధికి ఆడపిల్ల ఆవశ్యకత ఎంతో గొప్పన్నారు. భారతీయ వివాహ విధానం, సంస్కృతి ప్రపంచానికే ఆదర్శమన్నారు. ఆడపిల్ల మెడలో మంగళసూత్రం ప్రకాశిస్తుంటే భర్తతోపాటు, పిల్లలు, రెండు వైపులా వంశాలు శుభంగా ఉంటాయన్నారు. మంగళసూత్రంలో శుభాలు కల్గించే ఎన్నో సూత్రాలు ఉన్నాయని వివరించారు. దానాలలో అత్యంత విలువైనది కన్యాదానమన్నారు. కన్యాదానంతో తల్లిదండ్రులకు మోక్షం ప్రాప్తిస్తుందన్నారు.
కార్యక్రమంలో నిర్మాణకర్త శ్యామల వెంకటగిరి, ఎంపీపీ బీమగాని సౌజన్య, సర్పంచ్‌లు వీరాటి కవిత, అంకతి నాగేశ్వర్‌రావు, రజిత, సరోజ, అమ్మి, ఆలయ కమిటి చైర్మన్ రవిందర్‌రెడ్డి దాతలు డాక్టర్ పోలా నటరాజ్, డాక్టర్ నర్సింహారెడ్డి, వేములపల్లి సంతోష్‌కుమార్, పాల శ్రీనివాసులు, మామిడాల సుధాకర్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పురుషోత్తమచార్యులు ఆలయ కమిటి చైర్మన్ వీరాటి రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు.