మల్లన్నకు ఘనంగా సంప్రోక్షణ

ABN , First Publish Date - 2023-01-17T23:59:00+05:30 IST

ఐనవోలు జాతరను పురస్కరించుకుని లక్షలాదిమంది భక్తులతో పూజలందుకున్న మల్లికార్జున స్వామివారికి మంగళవారం వైభవంగా మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహించారు. పుణ్య హవాచనంలో భాగంగా వేదపండితులు, అర్చకులు స్వచ్ఛమైన జలంలో సుగంధద్రవ్యాలు, నవధాన్యాలు కలశంలో మిళితం చేసి మంత్ర పఠనం చేస్తూ స్వామి వారిని ఆవాహన చేశారు. తదుపరి ఆలయంతో పాటు ప్రాంగణంలో వేద మంత్రాల మధ్య ప్రోక్షణ (చల్లడం) జరిపారు.

మల్లన్నకు ఘనంగా సంప్రోక్షణ
ఆలయం ప్రాంగణంలో సంప్రోక్షణ చేస్తున్న అర్చకులు,

స్వామివారి ప్రతిబింబంతో అన్నపూజ

దర్శించుకున్న న్యాయమూర్తి సత్యేంద్ర

ఐనవోలు, జనవరి 17: ఐనవోలు జాతరను పురస్కరించుకుని లక్షలాదిమంది భక్తులతో పూజలందుకున్న మల్లికార్జున స్వామివారికి మంగళవారం వైభవంగా మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహించారు. పుణ్య హవాచనంలో భాగంగా వేదపండితులు, అర్చకులు స్వచ్ఛమైన జలంలో సుగంధద్రవ్యాలు, నవధాన్యాలు కలశంలో మిళితం చేసి మంత్ర పఠనం చేస్తూ స్వామి వారిని ఆవాహన చేశారు. తదుపరి ఆలయంతో పాటు ప్రాంగణంలో వేద మంత్రాల మధ్య ప్రోక్షణ (చల్లడం) జరిపారు. మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం చేసి శివలింగాన్ని స్వామివారి ప్రతిబింబంతో అలంకరించి అన్నపూజ నిర్వహించి మంత్రపుష్ప తీర్థప్రసాద వితరణ గావించారు. అనంతరం ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు బ్రాహ్మణులకు పండిత సన్మానాలు సమారాధనజరిపారు. సంప్రోక్షణ అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్‌, ఐనవోలు మఽధుకర్‌శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తంశర్మ, విక్రాంత్‌ వినాయక్‌ జోషి, అర్చకులు నరే్‌షశర్మ, మధుశర్మ, భానుప్రసాద్‌, ఉప్పల శ్రీనివాస్‌ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.

పట్టువస్త్రాల బహుకరణ

జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం కునూరు ప్ర జలు, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మల్లికార్జునస్వామికి పట్టువస్త్రాలు బహుకరించారు. జాతరలో లక్షలాది మంది భక్తులచే పూజలు అందుకున్న స్వామి వారికి మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహించాక స్వా మి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పట్టు వస్త్రాలను కూనూరు ఉమామహేశ్వరం(శివాలయం) దేవాల యం, గ్రామ పంచాయతీలు నాలుగు సంవత్సరాలుగా అందజేస్తున్నాయి. మల్లికార్జునస్వామి, గొల్లకేతమ్మ, బలిజమేడమ్మ, భ్రమరాంభదేవిక గణపతి ఆంజనేయస్వామిలకు పట్టువస్త్రాలను సమర్పించాక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు అర్చకుడు సదాశివం, కునూరు సర్పంచ్‌ ఇల్లందుల కుమార్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌, అజయ్‌కుమార్‌, గ్రామ పురప్రముఖులు పాల్గొన్నారు.

స్వామివారిని దర్శించుకున్న న్యాయమూర్తి

జిల్లా ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి వై.సత్యేంద్ర మంగళవారం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తికి అర్చకులు స్వాగతం పలికి శేషవస్త్రాలు బహుకరించి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.

Updated Date - 2023-01-17T23:59:06+05:30 IST