అప్పు తీర్చమంటే హతమార్చాడు..
ABN , First Publish Date - 2023-02-03T00:24:47+05:30 IST
అవసరానికి ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే గొడ్డలితో తలపై తీవ్రంగా దాడి చేసి హతమార్చిన సంఘటన కాజీపేట మండలం కడిపికొండలో జరిగింది. స్థానికులు, మడికొండ ఇన్‌స్పెక్టర్ జి. వేణు తెలిపిన వివరాల ప్రకారం.. కడిపికొండకు చెందిన జిర్ర ఎల్లయ్య పెద్దులు, ఉపేంద్ర దంపతుల కుమారుడు ప్రదీ్‌పకుమార్(27) కాజీపేటలో రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. 4 యేళ్ల కిందట కడిపికొండకు చెందిన తన దగ్గరి బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్‌కుమార్‌కు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. గడువు తీరిపోయినప్పటికీ వినయ్‌కుమార్ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఈ విషయం పెద్దమనుషుల వరకూ వెళ్లింది. భూమి అమ్మి ఇస్తానని పలుమార్లు గడువు తీసుకున్నాడు. అన్ని గడువులు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.
మడికొండ, ఫిబ్రవరి 2 : అవసరానికి ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే గొడ్డలితో తలపై తీవ్రంగా దాడి చేసి హతమార్చిన సంఘటన కాజీపేట మండలం కడిపికొండలో జరిగింది. స్థానికులు, మడికొండ ఇన్‌స్పెక్టర్ జి. వేణు తెలిపిన వివరాల ప్రకారం.. కడిపికొండకు చెందిన జిర్ర ఎల్లయ్య పెద్దులు, ఉపేంద్ర దంపతుల కుమారుడు ప్రదీ్‌పకుమార్(27) కాజీపేటలో రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. 4 యేళ్ల కిందట కడిపికొండకు చెందిన తన దగ్గరి బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్‌కుమార్‌కు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. గడువు తీరిపోయినప్పటికీ వినయ్‌కుమార్ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఈ విషయం పెద్దమనుషుల వరకూ వెళ్లింది. భూమి అమ్మి ఇస్తానని పలుమార్లు గడువు తీసుకున్నాడు. అన్ని గడువులు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.
ఈ క్రమంలో ప్రదీ్‌పకుమార్ బుధవారం వినయ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు అడగగా గొడవ జరిగింది. మధ్యాహ్నం తన సోదరిని హైదరాబాద్ వెళ్ళడానికి బస్ ఎక్కించి డ్యూటీకి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. రాత్రి ప్రదీ్‌పకుమార్ భార్య శ్రావణి ఫోన్ చేయగా డ్యూటీలో ఉన్నానని చెప్పాడు. అలాగే వినయ్‌కుమార్ ఫోన్ చేసి అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడిగితే ఫోన్‌లో గొడవ పడ్డాడని తెలిపాడు. కాగా, మర్నాడు గురువారం ఉదయం ప్రదీప్ ఇంటికి రాకపోగా ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అయోధ్యపురం చర్చి వెనుక శ్మశానవాటిక వద్ద చెట్ల పొదలలో ప్రదీ్‌పకుమార్ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ప్రదీ్‌పకుమార్ తల వెనుక భాగంలో తీవ్రంగా గాయపడి కింద పడి పోయి ఉన్నాడు.
ఏం జరిగిందని అడగగా కడిపికొండకు చెందిన పెసరు వినయ్‌కుమార్, కాసరబోయిన గోపి రాత్రి తనను పిలిపించి తనపై గొడ్డలితో దాడి చేసినట్లు తెలిపాడు. వెంటనే అతడిని కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా, ప్రదీ్‌పకుమార్ బుధవారం డ్యూటీలో ఉండగా అతడిని వినయ్‌కుమార్, గోపి పిలిపించి పథకం ప్రకారం దాడి చేశారా..? లేక ముగ్గురు కలిసి మద్యం సేవించిన తర్వాత నమ్మించి దాడి చేశారా అన్న విషయాలు విచారణ తర్వాత తెలుస్తాయని ఇన్‌స్పెక్టర్ తెలిపాడు. తల్లి ఉపేంద్ర ఫిర్యాదు మేరకు కేసు ఽనమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.