మెడికల్‌ కాలేజీ పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2023-04-29T00:25:10+05:30 IST

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు.

మెడికల్‌ కాలేజీ పనుల్లో వేగం పెంచాలి
మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా

కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 1000 క్వార్టర్స్‌ పరిసరాల్లో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 100 సీట్లతో మెడికల్‌ కాలేజీకి అనుమతులు వచ్చాయని, పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. పనులను పూర్తి నాణ్యతతో చేపట్టాలన్నారు. జూలై నుంచి తరగతులు ప్రారంభం అయ్యేలా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ జీడి తిరుపతి, డీఎంహెచ్‌వో శ్రీరామ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-29T00:25:10+05:30 IST