మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారణం అదే.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెల్లడి
ABN , First Publish Date - 2023-06-07T21:42:38+05:30 IST
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసు (Medico Preethi Case)లో పోలీసులు దూకుడు పెంచారు.
వరంగల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసు (Medico Preethi Case)లో పోలీసులు దూకుడు పెంచారు. ప్రీతి మృతి కేసులో చార్జ్‌షీట్ (Charge Sheet) దాఖలు చేశారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి MA సైఫ్ (Saif) వేధింపులే కారణమని గుర్తించారు. 70 మంది సాక్షులను విచారించినట్టు చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 970 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో పోలీసులు దాఖలు చేశారు.