అవనిపై ఇంద్రధనస్సు
ABN , First Publish Date - 2023-01-08T23:58:00+05:30 IST
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు... (గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. ఫ్రా గ్రెన్స్ పార్టనర్ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు.. హెల్త్ పార్టనర్ అమృతబిందు... ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ మరియు సెల్సియా) హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవోస్ కాలనీ రోడ్డు చర్చ్‌కాంపౌండ్‌లోని సె యింట్ పీటర్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఆదివారం జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది మహిళలు పాల్గొన్నారు.
ఘనంగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీ
హనుమకొండ సెయింట్ పీటర్స్ స్కూల్ గ్రౌండ్‌లో అలరించిన ముగ్గులు
జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న 148 మంది మహిళలు
సంస్కృతిని కాపాడేది మహిళలే : చీఫ్ విప్‌వినయ్
విజేతలకు బహుమతుల ప్రదానం
హనుమకొండ కల్చరల్, జనవరి 8: ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు... (గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. ఫ్రా గ్రెన్స్ పార్టనర్ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు.. హెల్త్ పార్టనర్ అమృతబిందు... ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ మరియు సెల్సియా) హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవోస్ కాలనీ రోడ్డు చర్చ్‌కాంపౌండ్‌లోని సె యింట్ పీటర్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఆదివారం జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది మహిళలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా..
ఉదయం 9గంటలకే గ్రౌండ్‌కు చేరుకున్న మహిళలు తమకు కేటాయించిన గళ్లను శుభ్రం చేసుకొని పోటీకి సిద్ధమయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్వయంగా ముగ్గు వేసి పోటీల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఏటా మహిళలను ప్రోత్సహిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షింపచే స్తున్నందుకు అభినందించారు. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు అనితారెడ్డి, ప్రభుత్వ పింగిళి కళా శాల ప్రొఫెసర్ జిరజిత, లయన్స్ క్లబ్ ఆఫ్ ఝాన్సీ డా క్టర్ పద్మజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మూడు గంటల పాటు సాగిన ఈ రంగవల్లుల పర్వాన్ని ఆద్యం తం నిశితంగా తిలకించిన న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు.
విజేతలు
ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి పరకాలకు చెందిన బోయిని రమాదేవి, ద్వితీయ బహుమతి హను మకొండ కిషన్‌పురకు చెందిన ఈర్ల లావణ్య, తృతీయ బహుమతి హనుమకొండ టైలర్‌స్ర్టీట్ ప్రాంతానికి చెంది న యాంసాని సరస్వతి గెలుచుకున్నారు. ప్రథమ బహు మతి కింద రూ.6వేలు, ద్వితీయ బహుమతిగా రూ.4వేలు, తృతీయ బహుమతిగా రూ.3వేలను విజేతల కు అందచేశారు. మరో 30మంది కన్సోలేషన్ బహుమ తులను అందుకున్నారు. పోటీలో పాల్గొన్న చిన్నారులకు విక్రమ్ పబ్లిషర్స్ పక్షాన నిమ్మల శ్రీనివాస్ డిక్షనరీలను బహూకరించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా హాజరైన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. బ్రాంచ్ మేనేజర్ వి.రఘుపతిరావు అధ్యక్షత వహించారు.
తరలివచ్చిన వీఐపీలు
ఒక వైపు మహిళలు ముగ్గులు వేస్తుండగా పోటీలను తిలకించేందుకు అధికార, అనధికారులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ‘కుడా’ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, అర్చక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, వేయిస్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, పీఆర్‌టీయూ నాయకులు తిరుపతి రెడ్డి, తిరునగరి శ్రీనివాస్, ఐ అండ్‌పీ ఆర్ ఏడీ లక్ష్మణ్ తదితరులు పోటీలను తిలకించారు. సుబేదారి సీఐ ఎం.డి. షుకూర్, రామకృష్ణ హాజరయ్యారు. అందమైన ముగ్గులు వేసిన మహిళలను అభినందించారు. వీఐపీల తాకిడి, కళాకారుల ఆటపాటలతో ముగ్గుల పోటీల ప్రాంగణం కళకళలాడింది. సందడిగా కనిపించింది.
జనగామ జిల్లాలో..
జనగామ జిల్లాకేంద్రంలోని సాన్ మారియా పాఠశాలలో ఆదివారం ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, విశిష్ట అతిథిగా మునిసిపల్ చైర్‌పర్సన్ పోకల జమున లింగయ్య హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో..
మానుకోట జిల్లా కేంద్రంలోని సమైక్య జూనియర్ కళాశాలలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముగ్గుల పోటీలను ఆదివారం నిర్వహించింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్-డాక్టర్ సీతామహాలక్ష్మి దంపతులు ముగ్గుల పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ముగ్గులను పరిశీలించిన అనంతరం విజేతలకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను మహబూబాబాద్ ఎంపీ కవిత చేతుల మీదుగా అందజేశారు.
సంస్కృతిని కాపాడేది మహిళలే..
మన సంప్రదాయాలు ప్రాచీనమైనవి..
చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
మన సంస్కృతి, సంప్రదాయాలు అత్యంత ప్రాచీనమైనవే కాకుండా, అద్వితీయమైనవని, వీటిని తరతరాలుగా కాపాడుతున్నది మహిళలేనని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటితరం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూనే సంప్రదాయాలను సైతం ఇప్పటికీ చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. తెలంగాణలో ముగ్గుల సందడితో సంక్రాంతి సంబరాలను ముందే మోసుకొచ్చిన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
ముగ్గుల్లో సందేశాలు : ఎమ్మెల్యే అరూరి
మహిళలల్లోని సృజనాత్మకతను ప్రతిబింబించేవి రంగవల్లులేనని, వారు వేసే ముగ్గుల్లో తరతరాల సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించడమే కాకుండా ఎన్నో సందేశాలను అందచేస్తాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఏటా క్రమం తప్పకుండా ముగ్గుల పోటీలను నిర్వహించడం ద్వారా సంప్రదాయ పరిరక్షణకు ఇతోధికంగా దోహదపడుతున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అభినందనలు, పోటీలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్ మాట్లాడుతూ.. ఘనమైన వారసత్వాన్ని, తెలు గు ఆత్మీయానందాలను నలుదిశలా పంచడానికి ముగ్గుల పోటీలు వారధిగా నిలుస్తాయన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుసంపన్నమైన మన వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి ము గ్గుల పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎంజీఎం సూప రింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రంగవల్లుల్లో అనేక సందేశాలు, ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయన్నారు. అర్చక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపల అందాన్ని ఇనుమడింప చేసే ప్రాచీనకాలం నుంచి వస్తున్న భారతీయ సంప్రదాయమన్నారు. ఆంరఽధజ్యోతి వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వి.రఘుపతిరావు మాట్లాడుతూ.. 17 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్‌చార్జి చిలుముల్ల సుధాకర్, ఎబీఎన్ ఇన్‌చార్జి దొంతు నవీన్, యాడ్స్ మేనేజర్ విజేందర్‌రెడ్డి, సర్క్యులేషన్ ఇన్‌చార్జి షరీఫ్, టీటీడీ జిల్లా కోఆర్దినేటర్ రామిరెడ్డి క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఖిలావరంగల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు, రచయిత బీకే బృందం అలపించిన సామాజిక గేయాలు మహిళలను ఉల్లాసపరిచాయి.
ప్రతిభకు గుర్తింపు
- బోయిన రమాదేవి, ప్రథమ బహుమతి విజేత
ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి రావడం సంతోషం అయితే.. నా ప్రతిభకు గుర్తింపు దక్కిండం ఎంతో ఆనందంగా ఉంది. 2018లో పరకాలలో ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో విజేతగా నిలిచాను. ములుగులో కూడా పాల్గొని విజేతగా నిలిచాను. ఈ సారి హనుమకొండలో చక్కని ఇతివృత్తంతో కూడిన ముగ్గును ఆవిష్కరింపచేశాను. ఫలితం కోసం ఎదురుచూడలేదు. కానీ నాప్రతిభకు గుర్తింపు లభించింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టూ ఆంధ్రజ్యోతి.
సంతోషంగా ఉంది.
- ఈర్ల లావణ్య, ద్వితీయ బహుమతి విజేత
హనుమకొండ జిల్లా స్థాయి ముత్యాల ముగ్గుల పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉంది. గతంలో కన్సోలేషన్‌కే పరిమితమైన నా ముగ్గుకు ఈ సారి ద్వితీయ బహుమతి దక్కడం ఆనందంగా ఉంది. మహిళలను ప్రోత్సహిస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యం, నిర్వాహకులు అభినందనీయులే. అందరికీ ఽకృతజ్ఞతలు.
టాప్ త్రీలో ఉండడం ఆనందంగా ఉంది
- యాంసాని సరస్వతి, తృతీయ బహుమతి విజేత
నాకు ఆంధ్రజ్యోతి పత్రికతో పది సంవత్సరాల అనుబంధం ఉంది. గతంలో కూడా ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో విజేతగా నిలిచాను. ఈ సారి కూడా తృతీయ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీలో పాల్గొనాలన్నది నా ఆశ. అది నెరవేరాలన్నది నా ఆకాంక్ష.