‘స్ర్పింగ్‌ స్ర్పీ’ వేడుకలకు రండి..

ABN , First Publish Date - 2023-03-23T23:31:16+05:30 IST

ఏప్రిల్‌ 6న వరంగల్‌ జాతీయ సాంకేతిక కళాశాల (నిట్‌)లో జరిగే స్ర్పింగ్‌ స్ర్పీ ఉత్సవ ప్రారంభానికి రావాలని సినీ నటుడు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ను కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఆ హ్వానించారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ను నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి రమణారావు, ప్రొఫెసర్లు, విద్యార్థులు గురువారం హైదరాబాద్‌లో కలిశారు. స్ర్పింగ్‌ స్ర్పీ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. దీనికి ఆయన అంగీకరించినట్లు ఈవెంట్‌ మేనేజర్‌ నరేందర్‌ నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ కొద్ది సేపు ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముచ్చటించారు.

‘స్ర్పింగ్‌ స్ర్పీ’ వేడుకలకు రండి..

నిట్‌క్యాంపస్‌ (కాజీపేట), మార్చి 23: ఏప్రిల్‌ 6న వరంగల్‌ జాతీయ సాంకేతిక కళాశాల (నిట్‌)లో జరిగే స్ర్పింగ్‌ స్ర్పీ ఉత్సవ ప్రారంభానికి రావాలని సినీ నటుడు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ను కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఆ హ్వానించారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ను నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి రమణారావు, ప్రొఫెసర్లు, విద్యార్థులు గురువారం హైదరాబాద్‌లో కలిశారు. స్ర్పింగ్‌ స్ర్పీ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. దీనికి ఆయన అంగీకరించినట్లు ఈవెంట్‌ మేనేజర్‌ నరేందర్‌ నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ కొద్ది సేపు ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముచ్చటించారు.

ఆర్‌ఈసీ నుంచి నిట్‌గా ఎలా ఎదిగింది? నిట్‌లో ఎన్ని కోర్సులు ఉన్నాయి? ఎంతమంది స్టూడెంట్స్‌ చదువుకుంటున్నారు? ఏఏ ప్రాంతం నుంచి విద్యార్థులు క్యాంప్‌సలో ఉంటున్నారనే విషయాలను పవన్‌ అడిగి తెలుసుకున్నారని సమాచారం. నిట్‌లో తన స్నేహితులు చాలామంది చదువుకున్నారని పవన్‌ ప్రొఫెసర్లతో చెప్పినట్లు తెలిపారు. పవన్‌ను కలిసిన వారిలో స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పులి రవికుమార్‌, స్ర్పింగ్‌ స్ర్పీ ఫ్యాకల్టీ అడ్వయిజర్‌ ప్రొఫెసర్‌ ఎం.హీరాలాల్‌, ప్రొఫెసర్లు ఆనంద్‌ కిశోర్‌ కోలా, పి.హరికృష్ణ, స్టూడెంట్స్‌ కౌన్సిల్‌ సభ్యులు వైభవ్‌, దేవరాజ్‌, మేఘనా, లోకేశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-23T23:31:16+05:30 IST