‘ఇందిరమ్మ’ రాజ్యంతోనే పేదల సంక్షేమం
ABN , First Publish Date - 2023-02-28T00:26:53+05:30 IST
‘పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పేరులోనే ధర్మం ఉంది.. బుద్ధిలో లేదు.. దం దాల ధర్మారెడ్డి అని పిలవాలి’’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నా రు. ఇందిరమ్మ రాజ్యం వస్తే నే పేదల కష్టాలు తీరుతాయని, తెలంగాణ ఇచ్చిన కాం గ్రె్‌సకు ఒక్క అవకాశం క ల్పించాలని రేవంత్ కోరారు. సోమవారం నడికూడ మండలం కంఠాత్మకూరు, ధర్మారం, నడికూడ, పులిగిల్ల, రాయపర్తిలలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రె్‌సకు ఒక్క అవకాశం ఇవ్వాలి
కేసీఆర్ పరిపాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
పరకాలలో హాత్ సే హాత్ జోడో యాత్ర
నడికూడ మండలం పులిగిల్లలో ప్రారంభం
పరకాల, ఫిబ్రవరి 27: ‘పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పేరులోనే ధర్మం ఉంది.. బుద్ధిలో లేదు.. దం దాల ధర్మారెడ్డి అని పిలవాలి’’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నా రు. ఇందిరమ్మ రాజ్యం వస్తే నే పేదల కష్టాలు తీరుతాయని, తెలంగాణ ఇచ్చిన కాం గ్రె్‌సకు ఒక్క అవకాశం క ల్పించాలని రేవంత్ కోరారు. సోమవారం నడికూడ మండలం కంఠాత్మకూరు, ధర్మారం, నడికూడ, పులిగిల్ల, రాయపర్తిలలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పరకాల మండలం పులిగిల్ల గ్రామంలోని సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి అక్కడినుండి హాథ్ సే హాథ్ జోడో యాత్రను 15వ రోజు పునఃప్రారంభించారు. పులిగిల్ల, రాయపర్తి, నర్సక్కపల్లి, మల్లక్కపేట మీదుగా యాత్ర పరకాలకు చేరుకుంది. పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
పోరాటాల గడ్డ.. పోరాటాలకు అడ్డా.. రజాకార్లకు ఎదురొడ్డి తుపాకీగుండ్లకు భయపడకుండా ప్రాణాలనుసైతం లెక్కచేయని ఈ గడ్డ నుంచి చెబుతున్నా.. తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తున్నానని అ న్నారు. ఇలాంటి గడ్డపై దందాలరెడ్డి ప్రతీ కాంట్రాక్టు తనదే అంటూ టెండ ర్లు, భూములు దోపిడీ చేశారని ఆరోపించారు. పరకాల నియోజకవర్గంలో 30వేల ఓట్లుంటే 10వేల ఓట్లు దళితులవేనని, అందులో ఏ కుటుంబానికైనా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చినవా అని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తె లంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 23లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని అన్నా రు. ఎన్నికల్లో గెలిచేందుకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, గొర్రెల పం పిణీ ఇలా.. ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, పావలావడ్డీ రుణాలు మహిళా సంఘాలు ఎక్కడికక్కడ కుంటుపడిపోయాయని అన్నారు.
కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే నేటికీ పరకాలలో కనిపిస్తోందని పేర్కొన్నారు. నేడు కాంగ్రె్‌సకు ప్రజాదరణ చూసి టీఆర్‌ఎస్ నాయకుల్లో వణుకు పుట్టిందని, దమ్ము, ధైర్యం ఉంటే డ్రామారావు, నీ అయ్య కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, దేవాదుల ప్రాజెక్టులు కట్టించామని పేర్కొన్నారు. కేసీఆర్ గ్రామం చింతమడకలో కూడా నేటికీ బడి, గుడి కాంగ్రెస్ హయాంలో కట్టించినవేనని అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, శిల్పారామం, మెట్రో రైలు కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 1200మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుని ఉద్యమకారుల కుటుంబాలను ఏ ఒక్కనాడు పలకరించి బుక్కెడు బువ్వపెట్టిన రోజులేదని అన్నారు. తెలంగాణలోని నాలుగుకోట్ల ప్రజలు మా కుటుంబమేనని డ్రామారావు మాట్లాడుతున్నది ఇప్పుడు రాబోయే ఓట్లకోసమేనన్నారు. ప్రజలంతా మీ కుటుంబమేఅయితే ప్రగతిభవనలోకి ప్రతిపక్షాలను, ప్రగతిభవన్ ముందున్న రోడ్డుమీదికి ప్రజలనెందుకు రానివ్వడంలేదని ప్రశ్నించారు. నిన్నగాక మొక్క చిన్నపిల్లాడిని కుక్కలు పీక్కతింటే కనీసం వారి కుటుంబాన్ని పలకరించి ధైర్యం చెప్పిన నాథుడు లేడని, లంబాడా బిడ్డ అయిన డాక్టర్ ప్రీతిని వేధింపులతో పొట్టనపెట్టుకుంటే ఐదురోజుల నుంచి హెచ్‌ఓడీ, ప్రిన్సిపల్‌లపై వేటు వేయకుండా తప్పుచేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావని మండిపడ్డారు. అదే నీ ఇంట్లో బిడ్డను చంపితే ఊరుకుంటావా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
రాక్షస పాలనకు బుద్ధిచెప్పాలె..
తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల ఓట్లతోనే గెలిచి కల్వకుంట్ల కుటుంబం నేడు రాక్షస పాలన చేస్తున్నదని, ఓటుతో వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబ రాక్షసపాలనకు బుద్ధిచెప్పాలన్నారు. దయాకర్‌రావు, ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్యల మెడలు వంచితే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా కేసీఆర్‌కు బుద్ధిచెప్పవచ్చునని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం గల్లీల్లో ఉద్యమం చేస్తే కాంగ్రెస్ నాయకులు వెళ్లి సోనియమ్మకు చెప్పి తెలంగాణ ఇప్పించారన్నారు. అలాంటి సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇల్లు కోసం రూ.5లక్షలు ఇస్తామని హామీనిచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, అనిల్‌కుమార్, శివసేనారెడ్డి, సౌజన్య, కట్కూరి దేవేందర్‌రెడ్డి, కట్కూరి స్రవంతిరెడ్డి, తిరుపతిరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, జయమ్మ పాల్గొన్నారు.