Share News

సర్వీస్‌ రోడ్ల సంగతేంది?

ABN , Publish Date - Dec 16 , 2023 | 12:04 AM

‘తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని’ అన్న చందంగా ఉంది జాతీయ రహదారి కాంట్రాక్టరు పరిస్థితి. యాదాద్రి జిల్లా వంగపల్లి నుంచి వరంగల్‌ జిల్లా అరెపల్లి వరకు దాదాపు వంద కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థ కొన్ని చోట్ల సర్వీస్‌ రోడ్లను వదిలేసింది. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించాలంటే నిబంధనల ప్రకారం రహదారిని ఆనుకొని ఉన్న ప్రతీ గ్రామంలో అనుసంధానంగా సర్వీస్‌ (లోకల్‌) రోడ్డు వేయాలి. కాని కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. అధికారులు, పాలకుల అలసత్వం కారణంగా ఏళ్ల తరబడి పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికైనా వాటిని పూర్తి చేసి తమ ఇబ్బందులు తొలగించాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సర్వీస్‌ రోడ్ల సంగతేంది?
ఘన్‌పూర్‌లో సర్వీస్‌ రోడ్డు వేయకుండానే వదిలేసిన దృశ్యం

రహదారి పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్న కాంట్రాక్టరు

ఏళ్లు గడుస్తున్నా కలగని మోక్షం

పట్టించుకోని పాలకులు, అధికారులు

ఇబ్బంది పడుతున్న బాధిత గ్రామాల ప్రజలు

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబరు 15: రహదారి విస్తరణ పనుల్లో భాగంగా యాదాద్రి-వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ పనులను 2015లో ప్రారంభించారు. దీనికో సం జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు-4 పథకం కింద రూ.1,920 కోట్లు మంజూరు చేశారు. 2016 జూన్‌ 1న అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. మంజూరైన నిధులలో రహదారి విస్తరణకు రూ.897.03 కోట్లు కేటాయించగా మిగితా 1,022.97 కోట్లు భూసేకరణ, గృహాలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడానికి కేటాయించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు చేపట్టింది.

యాదాద్రి జిల్లాలోని వంగపల్లి నుంచి వరంగల్‌ జిల్లాలోని అరెపల్లి వరకు 99.10 కిలోమీటర్ల మార్గాన్ని 30నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభిం చారు. కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 1వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని గడువు ఇచ్చింది. కాని ఇప్పటి వరకు అనేక చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

నిబంధనల ప్రకారం..

రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట ప్రజల సౌకర్యార్ధం సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయా లి. సర్వీసు రోడ్డు దాటి ప్రజలు నేరుగా జాతీయ రహ దారి పైకి రాకుండా గ్రామాల్లో సర్వీసు రోడ్డుకు, జాతీ య రహదారికి మధ్యలో ఇనుపకంచెతో రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి. సర్వీసు రోడ్డుకు, జాతీయ రహదారి (ఎక్స్‌ప్రెస్‌ హైవే) కు మధ్య సర్వీసు రోడ్డు పొడవునా హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయాలి. ప్రతీ గ్రామంలో ప్రయాణికుల కోసం మినీ బస్టేజీ ఏర్పాటు చేయాలి. సర్వీసు రోడ్డు ప్రక్కన గృహాల్లోకి వర్షం, డ్రెయినేజీ నీళ్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి.

పెండింగ్‌ పనులు ఇవే...

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రాఘవపూర్‌ గ్రామంలో, ఘన్‌పూర్‌ పరిధిలోని ఇందిరానగర్‌, ఛాగల్‌ గ్రామ పరిధి లోని శివారెడ్డిపల్లి వద్ద రహదారికి రెండు వైపులా సర్వీ సురోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్వీసు రోడ్లు లేక ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాఘవా పూర్‌ వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు కోసం సంబంధిత కాంట్రాక్టర్‌ కంకర పోసి వదిలేశారు. రోడ్డుకు ఇరువైపు లా గ్రామంలో 800 మీటర్ల పొడవున గృహాలు ఉండ డంతో ప్రజలు నేరుగా ఎక్స్‌ప్రెస్‌హైవేపైకి వెళ్లి ప్రమాదా ల బారిన పడుతున్నారు. సర్వీస్‌ రోడ్డు కోసం గ్రామం లో 100 ఫీట్లు తీసినప్పటికీ సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఠ ఘన్‌పూర్‌ బస్టాండ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే దారిలో సీర్వీసు రోడ్డు నిరుపయోగంగా మారింది. బస్టాండ్‌ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీసు రోడ్డు వేయాల్సిఉండగా కేవలం సబ్‌స్టేషన్‌ వరకే ఏర్పా టు చేసి వదిలేశారు. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.

ఠ చిలుపూరు మండలం చిన్నపెండ్యాల గ్రామంలో సర్వీసు రోడ్డు వేసినప్పటికీ హన్మకొండ-జనగామ వైపు గల సర్వీసు రోడ్డు పక్కన డ్రెయినేజీ పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఠ ధర్మసాగర్‌ మండలం కరుణాపురం వద్ద సర్వీసు రోడ్లు, రెయిలింగ్‌ ఏర్పాటు చేసినప్పటికీ హైమాస్ట్‌లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ్లల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

వినియోగంలోకి రాని సర్వీసు రోడ్లు...

పలు గ్రామాల్లో సర్వీస్‌ రోడ్లు పూర్తయినప్పటికీ వినియోగంలోకి రావడం లేదు. ఆయా గ్రామాల్లో అర్టీసీ బస్సులు జాతీయ రహదారి మీదనే నిలుపడంతో తరు చుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘన్‌పూర్‌లో కొన్ని చోట్ల వ్యాపారులు సర్వీసు రోడ్డును ఆక్రమిస్తున్నారు. దీంతో వాహనాలను రోడ్డుపై నిలుపుతున్నారు. ఫలితం గా ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయి.

గ్రామంలో సర్వీస్‌ రోడ్డు వేయాలి..

- కాసాని మల్లయ్య, రాఘవపూర్‌

మా గ్రామంలో ప్రజల నుంచి బలవంతంగా ఇంటిస్థలాలను తీసు కున్నారు. కాని సర్వీసురోడ్డును విస్మ రించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలో సర్వీసురోడ్లను పూర్తి చేయాలి.

అధికారులు నిర్లక్ష్యం వీడాలి..

- మునిగెల రమేష్‌, సీపీఎం మండల కార్యదర్శి

అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే పెండింగ్‌ పనులు పూర్తి చేయించాలి. ఘన్‌పూర్‌ పట్టణంలో సర్వీసురోడ్డు పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్వీసు రోడ్లు ఉన్నప్పటికీ జాతీయ రహదారి పైన బస్సులు నిలుపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Dec 16 , 2023 | 12:05 AM