Akshaya Tritiya: అక్షయ తృతీయ ఒక భారీ బంగారు మోసం మొదలు
ABN , First Publish Date - 2023-04-20T15:39:35+05:30 IST
కొందరు వ్యాపారులు దీన్నే టార్గెట్ చేశారు
హైదరాబాద్: ఈ పిచ్చి 20 ఏళ్ల క్రితం లేదు. ఇప్పుడు అక్షయ తృతీయ వస్తే ఎలా ఎగబడి బంగారం కొంటున్నారో చూస్తే మతిపోతోంది. దేశవ్యాప్తంగా వేల కోట్ల బంగారం ఈ రోజున ఇలా అమ్మెసుకుంటారు. అప్పోసప్పో చేసైనా సరే జనం ఎగబడి షాపుల్లో ఏదో కరువు వచ్చినట్లు బంగారం ఇలా కొనేసి దేవుడికి దండం పెడతారు. ఈ రోజున బంగారం కొంటే జీవితాంతం నిలవడమే కాకా.. ఎప్పటికి నశించిపోదని, ఇంకా వస్తోందని ఒక నమ్మకాన్ని తెలివిగా వ్యాపింపజేసి కొందరు వ్యాపారులు తమ అమ్మకాలకు దీన్ని టార్గెట్ చేశారు.
అక్షయ తృతీయ నాడు బంగారాన్ని చాలా మంది కొంటుంటారు. తమరు కూడా ఈ అక్షయ తృతీయకి బంగారం కొనగోలు చేయాలనుకుంటున్నారా.. బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా విటిని ఫాలోఅవండి. అప్పుడు మంచి బంగారాన్ని కొనుగోలు చేయడానికి వీలవుతోంది. బంగారాన్ని కొనుగోలు చేసే క్రమంలో కస్టమర్లు మోసపోకుండా ఉంటారు. ఈ సారి అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తోందని, అలానే అంతా శుభం కలుగుతోందని, అంతా నమ్ముతుంటారు.
అక్షయ తృతీయ రోజున నగల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. బంగాన్ని కొనేటప్పుడు తప్పకుండా విటిని ఫాలో అవ్వాలి. బంగారు నగలు కొనేటప్పుడు నాణ్యతను చూసుకోవాలి. అలానే స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. కేవలం ఈ బంగారంతోనే నగలు చేయడం సాధ్యం. అయితే బంగారు నగలు తయారు చేసేటప్పుడు ఇతర లోహాలు కలిపి 22 క్యారెట్ల నగలు తయారు చేస్తారు. చాలా వరకు షాపుల్లో 24 క్యారెట్ల నగలను అమ్ముతుంటారు కానీ, 24 క్యారెట్ల నగలు ఉండవు. కేవలం 22 క్యారెట్లు, 18 క్యారెట్ల నగలు ఉంటాయి. కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసేముందు స్వచ్ఛత గురించి తప్పక తెలుసుకోవాలి.
హాల్ మార్క్ ఉన్న నగలు కొంటే బంగారం స్వచ్ఛతకి హామీ ఉంటుంది. నగలు తయారీ చేసే వ్యాపారులు.. ఆ నగల్లో ఎంత బంగారం ఉందో టెస్ట్ చేయించి ఆభరణాలపై హాల్ మార్క్ ముద్ర వేయిస్తారు. హాల్ మార్క్ లేని నగలకంటే.. హాల్ మార్క్ ఉన్న నగలు తీసుకోవాలి. అలానే అభరణాన్ని బట్టి మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. 3 నుంచి 25 శాతం మధ్య ఉంటాయి. మేకింగ్ ఛార్జీలు వేరు. మంజూరీ వేరు అని గుర్తుపెట్టుకోండి. బంగారాన్ని కరిగించి ముక్కలు చేసి తయారు చేయడంతో కొంత బంగారం వేస్ట్ అవుతోంది. అయితే ఈ వేస్ట్ అయిన బంగారాన్ని కస్టమర్లు భరించాల్సి ఉంటుంది. అందుకే కస్టమర్ల నుంచి ఈ ఛార్జీలను వసూలు చేస్తారు. 5 నుంచి 7 శాతం వరకు ఈ ఛార్జీలు ఉంటాయి.