Election Commission: రూ.100కోట్ల విలువైన సొత్తు జప్తు
ABN , Publish Date - Apr 12 , 2024 | 07:32 AM
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.100కోట్లకుపైగా విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర వస్తువులను జప్తు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కోడ్ వచ్చాక స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ఇది: మీనా
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.100కోట్లకుపైగా విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర వస్తువులను జప్తు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత 24గంటల్లోనే రూ.197.66 లక్షల విలువైన వస్తువులను జప్తు చేసినట్టు తెలిపారు. జప్తు చేసిన వాటిలో రూ.2,503.13 లక్షల నగదు, రూ.1,249.68లక్షల విలువైన మద్యం, రూ.205.94లక్షల విలువైన డ్రగ్స్, రూ.5,123.58 లక్షల విలువైన ప్రెషస్ మెటల్స్, రూ.242.94లక్షల విలువైన ఉచిత వస్తువులు, రూ.704.66లక్షల విలువైన ఇతర వస్తువులను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రకాశంలో చెక్‌పోస్టుల తనిఖీ
ఒంగోలు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను గురువారం సీఈవో మీనా తనిఖీ చేశారు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి చెక్‌పోస్టును, పాత సింగరాయకొండ చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. వాహనాల తనిఖీ, వీడియో రికార్డింగ్ పనులను పరిశీలించారు.