Home » Election Commission
మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆహ్వానం పంపింది. నేరుగా తమను కలవాలని, అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపింది.
మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు పదేపదే తనిఖీ చేయడం, ఇందుకు సబంధించిన వీడియోను థాకరే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని థాకరే నిలదీశారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంపై ఈసీ ఘట్టి నిఘా వేసింది. ప్రచారంలో పాల్గొంటున్న ఏ ఒక్క నేతను వదిలిపెట్టకుండా అధికారులు వారి బ్యాగేజీలను తనిఖీ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం కోసం బుధవారంనాడు బారామతి వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగులను తనిఖీ చేసినట్టు అజిత్ పవార్ ఒక ట్వీట్లో తెలిపారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాము వ్యక్తం చేసిన సందేహాలపై ఎన్నికల సంఘం (ఈసీ) రాసిన లేఖను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రశ్నలు సంధించారు. శాంపిల్ సైజ్, సర్వేలు ఎక్కడ జరిగాయి? అందుకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై బీజేపీయేతర పార్టీలు తరచు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై సీఈసీ స్పందించారు.