Share News

Pawan Kalyan: పారిశుధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:44 PM

14,15 ఆర్ధిక సంఘం నిధులు కింద 2019-2024 వరకూ గ్రామ పంచాయితీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా? అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.

Pawan Kalyan:  పారిశుధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్

అమరావతి: 14,15 ఆర్ధిక సంఘం నిధులు కింద 2019-2024 వరకూ గ్రామ పంచాయితీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా? అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. రెండు ఆర్ధిక సంఘాలు కలిపి రూ.8283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.7587కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 696 కోట్ల 28 లక్షలు పంచాయితీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయితీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటోందన్నారు. గ్రామాల్లో పారిశుద్ద్యం సరిగా లేదన్నారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21 వేల మంది పనులకు రావాడం లేదన్నారు. దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయన్నారు. తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ద్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పవన్ పేర్కొన్నారు.


తాగునీరు మోటారు మరమ్మత్తులు చేపట్టకపోవడం , నీటి సరఫరా సరిగా లేకపోవడం, గ్రామ పంచాయితీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ అన్నారు. గ్రామ పంచాయితీలకు గ్రాంట్లు నిలుపుదల చేయకపోవడంతో గ్రామీణ ప్రజల జీవితం ప్రభావితం అయ్యిందన్నారు. గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యమైందని పవన్ అన్నారు. గ్రామ పంచాయితీల బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పీఎంఎఫ్‌ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణతో ఏకీకృతం చేయలేదన్నారు. దీని వల్ల కేంద్రం నుంచి నిధులు విడుదల కాకుండా మరింత నష్ట పోయాయన్నారు. గత ప్రభుత్వం మిస్ మేనేజ్‌మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పంచాయితీల విషయంలో వచ్చాయని పవన్ పేర్కొన్నారు.


స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు..

సభలో కూన రవికుమార్ మాట్లాడుతూ.. అధికారులు సభకు సమర్పించిన పత్రాలలో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. పాపులేషన్ రేషియోలో వేరియేషన్ లేనప్పుడు గ్రాంట్ ఎందుకు తగ్గుతూ వచ్చిందనే విషయమై వివరణ కోరారు. గ్రామ పంచాయితీలు అంటే లోకల్ సెల్ప్ గవర్నమెంట్ అని.. తలసరి ఆదాయం, స్టాంపు డ్యూటీలు, సీనరేజ్ చార్జీలు ఎందుకు గత ప్రభుత్వం ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రాలలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ నిధులు అన్ని గ్రామ పంచాయితీలకు ఇచ్చి ఉంటే సర్పంచులు ఎందుకు రోడ్లపై అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ పంచాయితీ నిధులు గ్రామాలకు ఎక్కడ విడుదల చేశారో చెప్పాలన్నారు.


ప్రత్యేకంగా వైట్ పేపర్ తేవాలి..

చింతమనేని ప్రభాకర్, గోండ్ శంకర్ మాట్లాడుతూ.. పంచాయితీలకు చెందిన నిధులు ఎందుకు వారికి ఇవ్వలేదో డిప్యూటీ సీఎం చెప్పాలని ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడికి మల్లించారు తేల్చాలని కోరుతున్నామన్నారు. దీనిపై పవన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయన్నారు. గ్రామ పంచాయితీలకు బ్లీచింగ్ పౌడర్ కోనడానికి కూడా డబ్బులు లేవన్నారు. దీనిపైన ప్రత్యేకంగా 4,5 గంటలు చర్చ జరగాలన్నారు. దీనిపై ప్రత్యేకంగా వైట్ పేపర్ తేవాలని భావిస్తున్నామన్నారు. 14 వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సొమ్ములో కొంత ఆర్ధిక శాఖ డిస్కంలకు పంపేసిందన్నారు. దీనికి ఎవ్వరి అనుమతి తీసుకోలేదని.. ఎందుకంటే వారిని ఎవ్వరు అడగరనేది వారి ఉద్దేశమని తెలిపారు. దీనికి పూర్తి స్థాయి సమాధానం రానున్న సమావేశాల్లో ఇస్తానన్నారు. గత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని.. గాంధీ ఫోటో పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడలేదన్నారు. గతంలో జరిగిన తప్పులన్నింటిపైనా అవసరం అయితే శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నామని పవన్ అన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:45 PM