AP News: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితా రద్దు: ఏపీ హైకోర్ట్
ABN , Publish Date - Mar 13 , 2024 | 12:01 PM
ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ (2018 Group1 Mains) ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్ష పేపర్లను రెండవసారి, మూడవసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్దమని హైకోర్ట్ ప్రకటించింది.
అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ (2018 Group1 Mains) ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్ష పేపర్లను రెండవసారి, మూడవసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్దమని హైకోర్ట్ ప్రకటించింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఆందోళన చెందవద్దు: ఏపీ ప్రభుత్వం
2018 గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చింది. వారి తరపున న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని హామీ ఇచ్చింది. తీర్పుపై ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది.
ఇవి కూడా చదవండి
Grandhi Srinivas: చిరంజీవికి పవన్‌కు పోలికేంటి?.. గ్రంధి ఫైర్
TDP: విజయనగరం జిల్లా టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి