Share News

IAS Officer's : మేం ఇక్కడే ఉంటాం!

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:55 AM

తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని, ఇక్కడే విధులు నిర్వహిస్తామని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు.

IAS Officer's : మేం ఇక్కడే ఉంటాం!
IAS Officers

  • ఏపీలోనే మమ్మల్ని కొనసాగించండి

  • ముఖ్యమంత్రికి ముగ్గురు ఐఏఎస్‌ల వినతి

  • సచివాలయంలో చంద్రబాబును కలిసిన

  • హరికిరణ్‌, సృజన, శివశంకర్‌

  • తనకు ముందే చెప్పి ఉండాల్సిందన్న సీఎం

  • కేంద్రంతో మాట్లాడతానని హామీ

  • కోర్టుకెళ్లే యోచనలో ఐఏఎస్‌లు?

అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని, ఇక్కడే విధులు నిర్వహిస్తామని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు. ఈ నెల 16వ తేదీలోపు తెలంగాణలో రిపోర్టు చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కె.సృజన, కడప జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ తోలేటి శుక్రవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తమ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని.. పోస్టింగ్‌ తీసుకునే సమయంలో తాత్కాలిక అడ్రస్‌ కింద హైదరాబాద్‌ చిరునామాలు ఇచ్చామన్నారు.


కేవలం అడ్ర్‌సలో మార్పు వల్ల తమను తెలంగాణకు కేటాయించారని తెలిపారు. స్థానికత కింద తమను ఇక్కడే కొనసాగించేలా చూడాలని కోరారు. వారి అభ్యర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారు. డీవోపీటీ అధికారులతో మాట్లాడతానని, కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ అంశం గురించి తనకు ముందే ఎందుకు చెప్పలేదని ఆయన వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. చెప్పిఉంటే కేంద్రంతో ఎప్పుడో మాట్లాడి ఉండేవాడినని అన్నట్లు సమాచారం. కాగా.. తెలంగాణలో రిపోర్టు చేయాలన్న డీవోపీటీ ఆదేశాలపై కోర్టుకెళ్లాలని ఈ ఐఏఎ్‌సలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 13 , 2024 | 11:59 AM