Donation : రాజధానికి 92 ఏళ్ల వృద్ధురాలి విరాళం
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:09 AM
అమరావతి రాజధాని నిర్మాణానికి 92 ఏళ్ల వృద్ధురాలు రూ.లక్ష విరాళం అందజేశారు.
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నిర్మాణానికి 92 ఏళ్ల వృద్ధురాలు రూ.లక్ష విరాళం అందజేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన బండ్ల వెంకటరత్నం సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి లక్ష రూపాయల చెక్కును అందించారు. రాజధాని నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు పడుతున్న శ్రమకు తోడ్పాటు అందించాలని తాను ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. రాజధాని కోసం చొరవ చూపి, విరాళంతో ముందుకొచ్చినందుకు ఆమెను చంద్రబాబు అభినందించారు.