A betel nut farmer : తమలపాకు రైతు విల విల
ABN , Publish Date - Sep 22 , 2024 | 11:30 PM
శుభ, అశుభ కా ర్యాల్లో అగ్రస్థానం తమలపాకులదే. తెలుగు సంప్ర దాయంలో తమలపాకులకు ఒక ప్రత్యేక స్థానం. ప్రాచీన కాలం నుంచీ కుల మతాలకతీతంగా తమ లపాకు వినియోగం ఉంది. వివాహాల అనంతరం విందు భోజనాల చివరలో కచ్చితంగా నోరు పండా ల్సిందే. తమలపాకు, వక్క, సున్నం వేసుకుని నమ లడం వల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవు తుందని పెద్దల మాట. స్వీట్ బీడాల్లో సుగంద ద్రవ్యాలు రంగరించి ఆకు చుట్టి ఇవ్వడంతో దానికి ఒక కొత్తరూపు అవతరిస్తుంది.
ఓబులవారిపల్లె, సెప్టెంబరు 21: శుభ, అశుభ కా ర్యాల్లో అగ్రస్థానం తమలపాకులదే. తెలుగు సంప్ర దాయంలో తమలపాకులకు ఒక ప్రత్యేక స్థానం. ప్రాచీన కాలం నుంచీ కుల మతాలకతీతంగా తమ లపాకు వినియోగం ఉంది. వివాహాల అనంతరం విందు భోజనాల చివరలో కచ్చితంగా నోరు పండా ల్సిందే. తమలపాకు, వక్క, సున్నం వేసుకుని నమ లడం వల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవు తుందని పెద్దల మాట. స్వీట్ బీడాల్లో సుగంద ద్రవ్యాలు రంగరించి ఆకు చుట్టి ఇవ్వడంతో దానికి ఒక కొత్తరూపు అవతరిస్తుంది. తిరుపతి హైదరా బాదు, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో పాన్ సెంటర్లు దర్శనమిస్తూ ఉంటాయి. పాన్‌బీడా విలు వ రూ. 20 మొదలు రూ. 50 వరకు ఉంటుంది.
తమలపాకును ఉమ్మడి కడప జిల్లాలో చెన్నూరు, ఊటుకూరు, ఖాజీపేట ప్రత్యేకంగా సాగు చేసేవా రు. జిల్లాల విభజన అనంతరం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు, వెంకటరాజం పేట, పుల్లంపేట మండల ప్రాంతాలు. ఓబులవారి పల్లె మండలం చిన్నఓరం పాడు, పెద్దఓరంపాడు, గాదెల, వెంకటరామపురం, తల్లెంవారిపల్లె, అయ్యల రాజుపల్లె, ఓబులవారిపల్లె, పున్నాటివారిపల్లె, కమ్మ పల్లి వంటి గ్రామాల్లో కొన్ని కుటుంబాలు పూర్తి స్థాయిలో తమలపాకు పంటనే ప్రధాన ఆదాయ వనరులుగా సాగు చేస్తారు.
బుట్టకు రెండు వేల తమలపాకులు ఉంటాయి. వాటిని కోయడానికి వంద రూపాయలు కూలీ అయితే బుట్ట, వరిగడ్డి, పురికోస, భోజనం కలిపి సుమారు రూ.200 అవుతున్నాయి. రెండేళ్లగా తమలపాకు సాగులో అధిక మొత్తంలో ఖర్చులే గాని ఆదాయం తక్కువగా వస్తోందని సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత కొలతల మేర సాలు తోలి అవిశ విత్తనాలను ఒత్తు గా చల్లుకోవాలి. నాటిన 40 రోజుల నుంచి విత్తన పు తీగ వేసుకోవడానికి అనువుగా తయారవుతుం ది. 60 రోజుల నుంచి నూతన తోట నుంచి దిగు బడి మొదలవుతుంది. అంతవరకు సస్యరక్షణ చర్య లు చేపట్టాలి. సాగు ఖర్చులు కూడా పెరిగిపో వ డంతో తమలపాకు దిగుబడి మొదలయ్యే వరకు ఎకరాకు లక్ష రూపాయలకు పైనే పెట్టుబడి పెట్టా ల్సివస్తుందని రైతులు వివరించారు. ఒకసారి సాగు మొదలు పెడితే మూడేళ్ల వరకు దిగుబడి వచ్చేది. పంట కాలం ఎక్కువకాలం రావడంతో ఖర్చులు పో ను రైతులకు ఆశాజనకంగా మిగులు బడి ఉండేది. ఏటా తిరిగి సాగు చేయడం ద్వారా పంట కాలం తగ్గిపోయింది. ప్రస్తుతం ఏడాదికి మించి ఉంటే రోగాలతో నిలువునా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన దిగుబడి వస్తే అమ్మకాల ధర పలకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీటిని హైదరా బాదు మార్కెట్‌కు తరలిస్తే వారు నచ్చిన రేటు పట్టీ కట్టి పంపుతారు. పండుగ సీజన్లలో అమ్మకపు దారులు అధిక మొత్తంలో తమలపాకులు కావా లని కోరేవారు. డిమాండ్‌కు తగ్గట్టుగా రేట్లు కూడా ఉండేవి. అయితే సరకు బాగా ఉంటే పండగ సమ యాల్లో రూ. 500 నుంచి రూ.600 అమ్మకాలు చేప డుతున్నారు. మిగిలిన సరకు మొత్తానికి రూ.80 నుంచి రూ.150 వరకు రేట్లు కడుతుండడంతో రైతులు ఇవ్వక తప్పడంలేదు. అధిక ఖర్చులు అవ డంతో సాగును తగ్గించేస్తున్నారు. రేట్లు తగ్గడానికి కారణం అడిగితే గతంలో వారానికి మూడు రోజు లు మాత్రమే హైదరాబాద్ మార్కెట్‌కు సరకు వెళ్లే దని, ప్రస్తుతం ప్రైవేటు బస్సుల ద్వారా రోజూ తమలపాకులు వెళుతుండ డంతో మార్కెట్టు కట్టడి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. రెండేళ్లుగా ఎకరాకు పైబడి సాగుచేసే రైతు 20 నుంచి 30 సెంట్లకే పరిమితం అవుతున్నారు. ఖర్చులు భరించలేక నచ్చిన పంట వదులుకోలేక కొంతే సాగు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ సాగు కోసం....
మేము కొన్నేళ్లుగా తమలపాకు సాగుతో జీవనం సాగిస్తున్నాం. తమలపాకు సాగులో తెలిసినన్ని మెళుకువలు మరొక పంట సాగుబడికి తెలియ దు. అప్పట్లో డబ్బు బాగా వచ్చేవి. ప్రస్తుతం చా లా ఇబ్బందిగా ఉంటోంది. మరొక పంట సాగు చేయడానికి ప్రత్యామ్నాయంగా చూస్తున్నాం.
ప్రసాద్‌రెడ్డి, ఓబులవారిపల్లె
డిమాండ్ తగ్గింది
రోజూ హైదరాబాదు మార్కెట్‌కు తమలపాకు లు వెళ్లడంతో డిమాండ్ తగ్గింది. బస్సులు ద్వారా వంద నుంచి 500 బుట్టలు వెళుతున్నా యి. ఫలితంగా రోజూ అమ్మకాలు సాగుతూ ఉండడంతో కొందరికి లాభాలు వస్తున్నాయి. రోజూ సరకు వెళ్లకుండా కట్టడి చేస్తే డిమాండ్ పెరిగి అందరికీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
దాసరి సుబ్రమణ్యం, అయ్యలరాజుపల్లె.