AP News: స్నేహితుడే యువతిలా చాటింగ్.. విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jul 15 , 2024 | 01:53 PM
సోషల్ మీడియా వచ్చాక మంచి, చెడు సమపాళ్లలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మోసాలు బాగా పెరిగిపోయాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఇన్‌స్టాగ్రామ్ నకిలీ ఖాతా ఓ వ్యక్తి ప్రాణం తీసింది.
పల్నాడు: సోషల్ మీడియా (Social Media) జనాలకు బాగా అందుబాటులోకి వచ్చాక మంచి, చెడు సమపాళ్లలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మోసాలు బాగా పెరిగిపోయాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఇన్‌స్టాగ్రామ్ నకిలీ ఖాతా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. దాసరి భాను ప్రకాష్ (19) యువకుడు తన స్నేహితుడితో ఇన్‌స్టా గ్రాంలో యువతిలా చాటింగ్ చేశాడు. ఇన్ స్టాగ్రాంలో ఓ యువతి పేరు మీద నకిలీ అకౌంట్ క్రియేట్ చేసుకుని స్నేహితుడితో చాటింగ్ చేసి అతడి వద్ద నుంచి భాను ప్రకాష్ 30 వేల రూపాయలు కాజేశారు.
విషయం తెలుసుకున్న స్నేహితుడు.. భాను ప్రకాష్‌ని తనను మోసం చేసినందుకు నిలదీశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భాను ప్రకాష్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న భాను ప్రకాష్‌ను కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ భాను ప్రకాష్ మృతి చెందాడు. అయితే స్నేహితుడి బెదిరింపుల వల్లే భాను ప్రకాష్ బలవన్మరణానికి పాల్పడ్డాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే భాను ప్రకాష్ స్వస్థలం తెనాలి కాగా.. కూలి పనుల కోసం రెంటపాళ్ల గ్రామానికి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
AP News: నల్లమల అడువుల ద్వారా శ్రీశైలం వెళ్తున్నారా?.. ఈ వార్త చదవాల్సిందే!
TS News: సెక్రటేరియట్ ముట్టడి... రాజారాం యాదవ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..
Read Latest AP News And Telugu News