Palamaneru forests: పలమనేరు అడవుల్లో అరుదైన గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్
ABN , Publish Date - May 18 , 2024 | 05:06 AM
ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు. శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ (శాస్త్రీయ నామం హైలా రానా గ్రాసిలిస్) అని పిలిచే ఈ కప్పను చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో గుర్తించారు.
ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు. శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ (శాస్త్రీయ నామం హైలా రానా గ్రాసిలిస్) అని పిలిచే ఈ కప్పను చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్శిటీ బోర్డుకు చెందిన పరిశోధకులు దీన్ని గుర్తించారు. శ్రీలంకలో ఎక్కువగా కనిపించే ఈ కప్ప వీపుపై బంగారు వర్ణం కలిగి, ఎక్కువ భాగం నలుపు రంగుతో ఉంటుంది. భారత ఉపఖండంలో ఇప్పటి వరకు 19 రకాల గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్స్ గుర్తించారని పరిశోధకులు తెలిపారు. - మంగళం