Share News

నీటి సంఘాలతో రైతులకు సేవలందిస్తాం: ఆళ్ల

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:31 AM

సాగునీటి సంఘాల ద్వారా రైతులకు సేవలు అందించే అవకాశం కల్పించినందుకు సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు సీఎం చంద్రబాబు, జలవనరుల మంత్రి రామానాయుడు..

నీటి సంఘాలతో రైతులకు సేవలందిస్తాం: ఆళ్ల

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ద్వారా రైతులకు సేవలు అందించే అవకాశం కల్పించినందుకు సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు సీఎం చంద్రబాబు, జలవనరుల మంత్రి రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నీటి సంఘాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో గోపాలకృష్ణారావును పల్లా శ్రీనివాసరావు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణారావు మాట్లాడుతూ, సాగునీటి సంఘాల ద్వారా సేవలందించేందుకు 6వేల మంది రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 49 వేల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, 6,149 మంది నీటి సంఘాల అధ్యక్షులు, 245 మంది డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, 58 మంది ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు.

Updated Date - Dec 29 , 2024 | 06:31 AM