Share News

కార్యకర్తలు అసహనానికి గురికావద్దు

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:45 PM

టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎటువంటి సమస్య పైన అపోహలు పెట్టుకోవద్దని, అసహనానికి గురికావద్దని ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరినీ గుండెల్లో ఉంచుకుంటామని టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానంద రెడ్డి స్పష్టం చేశా రు.

కార్యకర్తలు అసహనానికి గురికావద్దు
సమావేశంలో మాట్లాడుతున్న రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి

టీడీపీ ఇన్‌చార్జి ముక్కా స్పష్టీకరణ

పెనగలూరు, సెప్టెంబరు 3: టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎటువంటి సమస్య పైన అపోహలు పెట్టుకోవద్దని, అసహనానికి గురికావద్దని ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరినీ గుండెల్లో ఉంచుకుంటామని టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానంద రెడ్డి స్పష్టం చేశా రు. మంగళవారం సాయంత్రం కంబాలకుంట బీసీ కాలనీ సమీప కల్యాణ మండపంలో జరిగిన కూటమి పార్టీల కార్యకర్తల, నాయకుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత నియోజకవర్గాన్ని ప్రజలు ఐకమత్యంతో కూట మి అభ్యర్థికి విజయం సాధించిపెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త కష్టపడితేనే ఇంతటి విజయం సాధ్యమవుతుంద న్నారు. తన నాయకత్వాన్ని నమ్మి భారీ విజయా న్ని సాధించిపెట్టిన ప్రతి కార్యకర్తకు హృదయ పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఙతలు తెలియ జేశారు. నియోజకవర్గంలో పెనగలూరు మండ లానికి ప్రత్యేక గుర్తింపు ఇస్తానని భరోసా ఇచ్చా రు. మండల ప్రజలు కోరుకునే ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహకారంతో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తా నన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా చేపట్టిన అధికారులు ఈ ప్రభుత్వంలో అలజడు లు సృష్టిస్తున్నందువల్ల అభివృద్ధి ముందుకు సా గడం లేదన్నారు. ఉన్నతాధికారుల విషయంలోనే అలా ఉంటే ఇక మండలస్థాయిలో ఎలా ఉం టుందో ఆలోచించుకోవాలన్నారు. పైస్థాయిలో నైనా కిందిస్థాయిలోనైనా గత ప్రభుత్వంలో పని చేసిన సిబ్బంది ఆ మత్తు నుంచి బయట పడలేకపోతున్నారని అటువంటి వారితో అభివృద్ధి పనులు ఎలా సాధ్యమవుతాయో మీరే ఆలోచిం చుకోవాలన్నారు.


TDP1.gif

హాజరైన కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు

స్థానిక సమస్యలపై ఏకరవు పెట్టగా మండలంలోని ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ప్రజలకు ప్రధానమైన అభివృద్ధి పనులపై సాధ్యమైనంత త్వరగా దృష్టి సారిస్తానన్నారు. సమావేశం అనంతరం మండ ల నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించా రు. సమావేశంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్‌ లేబాక శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త బాలక్రిష్ణ, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు పేరుగు క్రిష్ణయ్యనాయుడు, నియోజకవర్గ యువ త ఉపాధ్యక్షులు ఎం.రాంప్రసాద్‌నాయుడు, మా జీ మండల పార్టీ అధ్యక్షుడు కె.జయరామయ్య, ఎం.సత్యనారాయణ నాయుడు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు పుచ్చకాయల రవికుమార్‌, కె.నాగేశ్వర్‌నాయుడు, కమ్మ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పి.నరే ష్‌బాబు, న్యాయవాది రెడ్డయ్య, మాజీ సర్పంచు లు ఎం.లక్ష్మీనరసయ్య, నారాయణ, మల్లయ్య, పిచ్చయ్య, మండల మాజీ బీసీ సంఘం అధ్యక్షు డు కొండూరు వెంకటయ్య, ఎస్సీసెల్‌ మాజీ అధ్యక్షుడు కొరముట్ల వెంకటసుబ్బయ్య, కత్తి సుబ్బరాయుడు, వెంకటయ్య, కమతం జయ రామయ్య, వీరబల్లె హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:45 PM