NMD Farooq: అఘోరా అలా చెప్పాడు.. ఇలా ఫరూక్ మంత్రి అయ్యాడు!
ABN , Publish Date - Jun 14 , 2024 | 01:32 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాల ముందు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది... ఈ పార్టీ గద్దెనెక్కుతుందంటూ పలు సర్వే సంస్థలు వరుసగా ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాల ముందు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది... ఈ పార్టీ గద్దెనెక్కుతుందంటూ పలు సర్వే సంస్థలు వరుసగా ప్రకటించాయి. ఇక స్వామిజీలు, బాబాలు, జోతిష్య పండితులు ఎవరికి వారు.. తమదైన శైలిలో ఆ పార్టీదే ఘన విజయం.. ఈ పార్టీకే విజయం దక్కుతుందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఓటర్లు మాత్రం కూటమికే పట్టం కట్టారు.
నాడు షాక్.. నేడు ఆశ్చర్యం!
ఇక ఈ ఎన్నికలకు జస్ట్ రెండు నెలల ముందు నంద్యాలలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్.. పార్టీ కార్యాలయంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఓ అఘోరా ఆకస్మాత్తుగా కార్యాలయంలోకి వచ్చారు. దీంతో ఫరూక్‌తోపాటు అక్కడే ఉన్న పార్టీ కేడర్ ఒకింత విస్మయానికి గురయ్యారు. ఫరూక్ ముందు ఆ అఘోరా కూర్చునీ.. ‘ఈ ఎన్నికల్లో ఓ కష్టాన్ని దాటబోతున్నావ్.. నిన్ను ఎదురించే వారు ఎవరు లేరు. మంత్రి పదవి సైతం అందుకోబోతున్నావ్. అలాగే హిందువులు, ముస్లింలు సోదరభావంతో కలిసిమెలసి ఉంటారు’ అని చెప్పారు. అన్నట్లుగానే ఫరూక్ మంత్రి అయ్యారు. అఘోరాకు ముందుగానే ఎలా తెలిసింది..? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అక్షరాలా నిజమైంది!
మరోవైపు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్ సైతం కొలువు తీరింది. ఇందులో నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంకోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫరూక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయ్యాలయ్యాయి. ఇక చంద్రబాబు కేబినెట్‌లో గతంలో సైతం ఫరూక్ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే అఘోరా చెప్పినట్లే.. ఫరూక్ విషయంలో జరిగిందని అభిమానులు, అనుచరులు.. పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.