Home » Nandyal
పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతాంగం పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని హర్యానా పోలీసులు మూడోసారి అడ్డుకున్నారని, వారిపై భాష్పవాయువు ప్రయోగించడం అమానుషం అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నరసింహులు అన్నారు.
మహానంది క్షేత్రంలో ఆదివారం వేలాదిమంది భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించు కున్నారు.
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ఆత్మకూరు మండలంలో మొత్తం 8 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా ఒకచోట ఓటరు జాబితా సక్రమంగా లేకపోవడంతో ఎన్నిక వాయిదాపడింది.
మహానంది క్షేత్రానికి శనివారం దైవదర్శనం కోసం సినటీ నటుడు శివమ్ వచ్చారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.
జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణించాలని సినీ, టీవీ నటుడు సాయికిరణ్ అన్నారు.
వెలుగోడు మండలంలో జరిగిన ఉపాధి పనులలో రూ.65,230 దుర్వినియోగం అయ్యాయని, వాటిని రికవరీ చేయాలని పీడీ జనార్దన్రావు ఆదేశించారు.
గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా శబరిమల(Shabari mala)కు సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కొల్లాం(Guntur-Kollam) ప్రత్యేక రైలు (నం. 07181) జనవరి 4, 11, 18 తేదీల్లో రాత్రి 11-45 గంటలకు గుంటూరులో బయలుదేరి 6, 13, 20 తేదీల్లో ఉదయం 6-20 గంటలకు కొల్లాంకు చేరుకుంటుందన్నారు.
శ్రీశైల క్షేత్రంలో ఆదివారం లోకకళ్యాణార్థం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు.