Share News

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:47 AM

సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం), జూన్‌ 1: సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. వీరికి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. జాలాదిగా పేరుగాంచిన జాలాది రాజారావు 275 సినిమాల్లో 1500కు పైగా పాటలను రాశారు.

గేయ రచయితగా ఆయన ప్రయాణంలో ఆఘ్నేశమ్మ ప్రముఖ పాత్ర పోషించారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మర్రిపాలెం పీఎఫ్‌ ఆఫీస్‌ వద్ద ఉన్న ప్రశాంతినగర్‌లో వారి స్వగృహం నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్దనున్న క్రైస్తవ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్టు ఆమె కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె విజయ తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు. జాలాది రాజారావు 2011లో కన్నుమూశారు.

Updated Date - Jun 02 , 2024 | 05:49 AM