Home » Visaka
సింహాచల దేవస్థానం, అనుబంధ ఆలయ అంశాలపై అధికారులతో విశాఖలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింద్ర ప్రసాద్, దేవదాయ శాఖ అధికారులు, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొ్న్నారు.
అదో ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు ఎంతమంది అనుకుంటున్నారా?.. ఒకే ఒక్కడు!! మరో పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే!.
విశాఖ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి వ్యవహారంలో రెండు సంస్థలపై అధికారులు కేసులు నమోదుచేశారు.
విశాఖ పెద్దవాల్తేరు ప్రాంతంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ ఓ మహిళ తలకు గాయమైంది. దీంతో ఆమె హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు గాయం పెద్దదిగా ఉండడంతో తల స్కానింగ్ తీయాలని చెప్పారు.
హనీ ట్రాప్ కేసులో అరస్టయ్యి జైల్లో ఉన్న కిలేడీ జాయ్ జమీమా అలాంటి వ్యక్తి కాదంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలను బాధిత కుటుంబం ఖండించింది. జాయ్ జమీమా తమ కుమారుడి(ఎన్ఆర్ఐ)ని తీవ్ర ఇబ్బందులు పెట్టిందని బాధితుడి తల్లి లక్ష్మి ఆరోపించింది.
ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు.
విశాఖలో డీప్ టెక్ సదస్సు.. ఈ కార్య క్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామని, 2014-19 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13 శాతమని.. ఇప్పుడు 15 శాతం టార్గెట్‌గా పనిచేస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఆరో తేదీన నోవాటెల్‌లో జరిగే ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’లో పాల్గొంటారు. దీనిని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
దుర్గారావు, సుష్మిత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అనంతరం ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అయితే పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్పిలో చికిత్స పొందుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది పూర్తి నివేదికతో ప్రభుత్వం దృష్టి సారించింది.