Share News

Amaravti :భూముల సర్వే నిలిపివేత?

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:10 AM

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్‌రెడ్డి ఆయన తండ్రి వైఎ్‌సఆర్‌ పేరిట చేపట్టిన భూముల సర్వేపై సమీక్ష చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన భూముల సర్వేపై సదభిప్రాయం లేదని, రికార్డుల్లో తప్పులొచ్చాయని రైతాంగం ఆందోళన గా ఉంది.

Amaravti :భూముల సర్వే నిలిపివేత?

పాత రికార్డులు పునరుద్ధరించే అవకాశం

అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్‌రెడ్డి ఆయన తండ్రి వైఎ్‌సఆర్‌ పేరిట చేపట్టిన భూముల సర్వేపై సమీక్ష చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన భూముల సర్వేపై సదభిప్రాయం లేదని, రికార్డుల్లో తప్పులొచ్చాయని రైతాంగం ఆందోళన గా ఉంది. ఈ నేపథ్యంలో భూముల సర్వేను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తొలుత జగన్‌ ఫొటోలతో ఉన్న పాసుపుస్తకాల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్‌ పేరిట సిద్ధం చేసిన సర్వేరాళ్లను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై పలు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను రద్దుచేసిన చంద్రబాబు ప్రభుత్వం.. దానితో ముడిపడిన రీ సర్వేపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుంది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తారని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే ఈ అంశంపై నివేదిక కోరినట్లు తెలిసింది. భూముల సర్వేను రద్దుచేసే పక్షంలో 2020 డిసెంబరు నాటికి ఉన్న రెవెన్యూ రికార్డులనే పునరుద్దరించే అవకాశాలున్నాయని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - Jun 18 , 2024 | 05:10 AM