Share News

Ambati Rambabu : నా ఫిర్యాదుపై కేసు నమోదుకు ఆదేశించండి

ABN , Publish Date - Dec 25 , 2024 | 06:58 AM

: జగన్‌తో పాటు తనను, తన కుటుంబసభ్యుల ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు..

Ambati Rambabu : నా ఫిర్యాదుపై కేసు నమోదుకు ఆదేశించండి

  • హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): జగన్‌తో పాటు తనను, తన కుటుంబసభ్యుల ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. స్వయంగా వాదనలు వినిపించేందుకు పార్టీ ఇన్‌ పర్సన్‌గా వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - Dec 25 , 2024 | 06:58 AM