Share News

Amrita who excelled in SGF sports: ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో సత్తా చాటిన అమృత

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:27 PM

జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌ పోటీల్లో వీరబల్లి కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని డి. అమృత సత్తా చాటి మూడు విభాగాల్లో విజేతగా నిలిచింది. శనివారం కడప రిమ్స్‌ సమీప స్పోర్ట్స్‌ స్కూల్‌లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు జరిగా యి.

Amrita who excelled in SGF sports: ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో సత్తా చాటిన అమృత
లాంగ్‌ జంప్‌ ప్రథమ విజేత అమృతతో పీఈటీ

కడప స్పోర్ట్స్‌ స్కూల్‌లో వేడుకగా అథ్లెటిక్స్‌ పోటీలు

కడప (స్పోర్ట్స్‌) సెప్టెంబరు 28: జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌ పోటీల్లో వీరబల్లి కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని డి. అమృత సత్తా చాటి మూడు విభాగాల్లో విజేతగా నిలిచింది. శనివారం కడప రిమ్స్‌ సమీప స్పోర్ట్స్‌ స్కూల్‌లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు జరిగా యి. జిమ్నాస్టిక్‌, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ రన్నింగ్‌ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అండర్‌-14, అండర్‌-17 విభాగాల బాల, బాలికలు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్‌పుట్‌ అండర్‌-17 బాలుర విభాగంలో జగదీష్‌ ప్రధమ,కె. వినోద్‌ ద్వితీయం, గోపీకృష్ణ తృతీయ స్థానం పొందారు. బాలికల విభాగంలో శివమణి ప్రధ మం, సువాసిని ద్వితీయం, డి. అమృత తృతీయ స్థానం పొందారు. అండర్‌-14 బాలికల విభాగంలో కె. ఇందిర, (ప్రథమ) వి. కోమల ప్రియ (ద్వితీయ) ఎం. ప్రార్థన (తృతీయ), అండర్‌- 14 బాలుర విభాగంలో జి. శ్రీను (ప్రథమ) ఉస్మాన్‌ (ద్వితీయ) గంగాధర్‌ (తృతీయ) విజేతలుగా నిలిచారు.


లాంగ్‌జం్‌పలో ప్రథమ స్థానంలో అమృత

వీరబల్లి కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని డి. అమృత అండర్‌ -17 బాలికల లాంగ్‌జంప్‌లో ప్రథమ స్థానం పొందింది. ద్వితీయ స్థానంలో అంజనాసౌమ్య నిలిచారు. జావలిన్‌త్రోలో ద్వితీయం, షాట్‌పుట్‌లో తృతీయ విజేతగా అమృత నిలిచినట్లు పీఈటీ పార్వతి వెల్లడించారు. మూడు క్రీడా విభాగాల్లో తమ విద్యాలయానికి చెందిన అమృత ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవడం సంతోష దాయకమన్నారు.

1Chapadu-28.gifమాల్కబ్‌ పోటీలకు ఎంపికైనవిద్యార్థులతో సిబ్బంది

రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

చాపాడు, సెప్టెంబరు 28: నరహరిపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సునీల్‌, శ్రీదివ్య మాల్కబ్‌ అండర్‌-17 రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెడ్మాస్టర్‌ నరసింహశాస్త్రి పేర్కొన్నారు. 28న శనివారం మైదుకూరులో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి మాల్కబ్‌ ఆటల పోటీలకు వీరిని ఎంపిక చేశారన్నారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో హెడ్మాస్టర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ ప్రశాంతి, ఉపాధ్యాయులు హర్షం వెలిబుచ్చారు.

జిల్లా స్థాయి పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థులు

వీరబల్లి, సెప్టెంబరు28: ఉప్పరపల్లి జిల్లా పాఠశాల విద్యార్థులు ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌, పీఈటీ శేఖర్‌ తెలిపారు. అండర్‌-17 వాలీబాల్‌ బాలుర విభాగంలో శివ, అండర్‌-14లో వెంకటచైతన్య, అశ్వత్‌బాషా, అండర్‌-17 బాలికల కబడ్డీలో రెడ్డెమ్మ, కృష్ణవేణి, ఐసా, షబానా, అండర్‌-17 బాలుర విభాగంలో ఓబుల్‌ రెడ్డి, నాజర్‌బాషా, అండర్‌-17 ఖోఖో బాలుర విభాగంలో బాలాజీ, నాజర్‌ బాషా, అండర్‌-14లో మనోహర్‌ ఎంపికైనట్లు చెప్పారు. హెచ్‌ఎం, ఉపా ధ్యాయులు అభినందించారు. రాష్ట్ర స్థాయి గెలుపొందాలని సూచించారు.


28vpl-5.gifహ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికైన వేంపల్లె విద్యార్థులతో సిబ్బంది

జాతీయస్థాయి పోటీలకు వేంపల్లె విద్యార్థులు

వేంపల్లె, సెప్టెంబరు 28: 38వ జాతీయస్థాయి అసోసియేషన్‌ సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలకు వేంపల్లె తలిశెట్టి జిల్లాపరిషత్‌ బాలుర పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పీడీ రాజశేఖర్‌ తెలిపారు. ఈనెల 20, 21వ తేదీల్లో వేంపల్లెలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ప్రతిభ కనబరిచి సరిబాల ఆదిశేషారెడ్డి, అలవలపాడు విష్ణువర్దన్‌, కం తూరి వెంకటశ్రీరామ్‌ ఎంపికయ్యారన్నారు. అక్టోబరు 3 నుంచి హైదరాబాద్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు శివమునెమ్మ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

Discuss-Thr.gifడిస్కస్‌త్రోలో రాష్ట్రస్థాయికి చక్రంపేట విద్యార్థులు

పెనగలూరు, సెప్టెంబరు 28: కడపలో శనివారం జరి గిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో చక్రంపేట ఉన్నత పాఠ శాల విద్యార్థినులు డిస్కస్‌ త్రో విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధా నోపాధ్యాయులు లేపాకు గోపాలకృష్ణ తెలిపారు. సీని యర్స్‌ విభాగంలో బి.సానియా జిల్లాస్థాయిలో 3వ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. జూనియర్స్‌ విభాగంలో సర్వజ్ఞ డిస్కస్‌త్రోలో 2 స్థానం సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

Updated Date - Sep 28 , 2024 | 11:28 PM