Share News

Agnibaan: అగ్నిబాణ్ ప్రయోగం.. కౌంట్‌డౌన్ చివరి దశలో ఊహించని ట్విస్ట్

ABN , Publish Date - May 28 , 2024 | 10:54 AM

అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి ఇస్రో, భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇవాళ మెట్టమొదటి ప్రయివేటు రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగానికి షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం వేదిక కానుంది. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఈ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామునే ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ సైతం షార్‌కి చేరుకున్నారు. అంతా బాగానే ఉంది. ఇక రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.

Agnibaan: అగ్నిబాణ్ ప్రయోగం.. కౌంట్‌డౌన్ చివరి దశలో ఊహించని ట్విస్ట్

నెల్లూరు: అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి ఇస్రో, భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇవాళ మెట్టమొదటి ప్రయివేటు రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగానికి షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం వేదిక కానుంది. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఈ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామునే ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ సైతం షార్‌కి చేరుకున్నారు. అంతా బాగానే ఉంది. ఇక రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.

CM Jagan: డికోడర్ ఇంటర్వ్యూలో ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్


శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ జరగాల్సిన ప్రయివేటు రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడింది. వాయిదాకి అగ్నికుల్ సంస్థ కారణాలను వెల్లడించలేదు. త్వరలో మళ్లీ ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది. అగ్నికుల్ ప్రయోగం ఇప్పటి వరకూ మూడుసార్లు ప్రయోగం వాయిదా పడింది. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగానికి అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేటు స్టార్టప్ సంస్థ శ్రీకారం చుట్టింది. అగ్నికుల్ రాకెట్‌ని అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేటు స్టార్టప్ సంస్థ రూపొందించింది. షార్‌లోని సముద్ర తీరాన ప్రయివేటు రాకెట్ ప్రయోగ వేదికను ఏర్పాటు చేశారు. అంతరిక్ష రంగంలో ప్రయివేటు ప్రయోగాలకి అవకాశం కల్పించడంతో.. మల్టీమిలియన్ డాలర్ల మార్కెట్‌కి అవకాశం కల్పించినట్టుగా అయ్యింది.

Andhra Pradesh :క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

Read more AP News and Telugu News

Updated Date - May 28 , 2024 | 10:54 AM