sheep died విద్యుత ప్రమాదంలో 10 గొర్రెలు మృతి
ABN , Publish Date - Jun 05 , 2024 | 12:12 AM
మండలంలోని డేగానివారిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన విద్యుత ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందాయి.
తనకల్లు, జూన 4: మండలంలోని డేగానివారిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన విద్యుత ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందాయి.
బాధితుడు రమణ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాను గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నానన్నారు. కాగా సోమవారం రాత్రి గొర్రెలను షెడ్‌లోకి తోలానని, పైనున్న విద్యుత వైరు తెగి షెడ్ పైన పడిందని, దీంతో విద్యుత సరఫరా అయి షాక్‌తో పది గొర్రెలు మృతిచెందాయని వాపోయారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...