23 sheep killed: కుక్కల దాడిలో 23 గొర్రెలు మృతి
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:48 AM
మండలంలోని సున్నంపుగుట్టతండాలో రవినాయక్‌కు చెందిన 23 గొర్రెలు కుక్కలదాడిలో మృతి చె ందాయి. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
- బాధితుడికి కందికుంట పరామర్శ
నంబులపూలకుంట, జూన 2: మండలంలోని సున్నంపుగుట్టతండాలో రవినాయక్‌కు చెందిన 23 గొర్రెలు కుక్కలదాడిలో మృతి చె ందాయి. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
శనివారం మధ్యరాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడిందని, ఉరుముల శబ్ధానికి మందలోని పలు గొర్రెలు బయటకు వచ్చాయన్నారు. గమనించిన ఊరి కుక్కలు హుఠాత్తుగా వాటిపై దాడి చేసి చంపేశాయన్నారు. ఆ సమయంలో విద్యుత లేదని, దీంతో గొర్రెలను కాపాడుకోలేక పోయామని కంటతడిపెట్టారు. ఇటీవల కూడా 20 గొర్రెలు వ్యాధుల బారినపడి మృతిచెందాయన్నారు. రూ.6లక్షలు అప్పు చేసి 110 గొర్రెలను కొనుగోలు చేశానని, వీటిలో ఇప్పటికి 43కుపైగా చనిపోయాయని వా పోయారు. మొత్తంమీద దాదాపు రూ. 3.5 లక్షల వరకు నష్టం జరిగిందని బాధపడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. విషయం తెలుసుకున్న కూటమి ఎ మ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆదివారం గ్రామానికెళ్లి బాధితుడిని పరామర్శించారు. సంఘటనపై వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.20వేలు ఆర్థికసాయం అందించారు. పదిరోజుల తరువాత మరికొంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కందికుంట వెంట మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్ పోమేనాయక్, గ్రామస్థులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...